Covishield Green Pass : కోవిషీల్డ్‌కు గ్రీన్ ‘పాస్’ సిగ్నల్.. 15 యూరోపియన్ దేశాలకు వెళ్లొచ్చు!

ప్రపంచమంతా కరోనా మహమ్మారి విస్తరించింది. ఎక్కడికి వెళ్లినా కరోనా భయం వెంటాడుతోంది. అందుకే ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకుంటేనే అనుమతిస్తామని ప్రపంచ దేశాలు షరతులు విధిస్తున్నాయి.

Covishield Green Pass : కోవిషీల్డ్‌కు గ్రీన్ ‘పాస్’ సిగ్నల్.. 15 యూరోపియన్ దేశాలకు వెళ్లొచ్చు!

Covishield Is Now Recognised By 15 European Countries

Covishield Green Pass : ప్రపంచమంతా కరోనా మహమ్మారి విస్తరించింది. ఎక్కడికి వెళ్లినా కరోనా భయం వెంటాడుతోంది. అందుకే ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకుంటేనే అనుమతిస్తామని ప్రపంచ దేశాలు షరతులు విధిస్తున్నాయి. కరోనా కష్టకాలంలో విదేశాలకు వెళ్లే ప్రయాణికులను తమ దేశంలోకి అనుమతించేందుకు చాలా దేశాలు వ్యాక్సిన్ తప్పనిసరి చేశాయి. ఆయా వ్యాక్సిన్లు వేయించుకుంటేనే తమదేశంలోకి ఎంట్రీ అంటున్నాయి. ఈయూలో సభ్య దేశాలు డిజిటల్ ‘వ్యాక్సిన్ పాస్‌పోర్ట్’ను ప్రారంభించాయి. అదే.. ‘Green Pass’.. ఇది ఉంటేనే అనుమతిస్తామంటున్నాయి.

ఇప్పటికే యూరోపియన్ యూనియన్ వ్యాక్సిన్ల జాబితా విడుదల చేసింది. ఇప్పుడా ఆ జాబితాలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ కూడా అర్హత పొందింది. కరోనా టీకా కోవిషీల్డ్‌కు ఈయూ ఆమోదం తెలిపింది. యూరోపియన్ యూనియన్ దేశాల తెలిపిన దేశాల సంఖ్య 15కు చేరింది. అందులో లేటెస్ట్ యూరోపియన్ దేశంగా బెల్జియం ఆ జాబితాలో చేరింది. బెల్జియంలో కూడా కోవిషీల్డ్ వ్యాక్సిన్ కు అనుమతించారు. ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనికా రూపొందించిన ఈ టీకాను సీరమ్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ ఇండియా (SII) ఉత్పత్తి చేస్తోంది. బెల్జీయం కూడా ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను ఆమోదించింది. ఇకపై ఈ దేశంలోకి వెళ్లే భారతీయులకు మార్గం సుగమమైంది.

భారత్ లోని బెల్జియం ఎంబాసీలో టీకాల అసమానతపై పోరాడగా.. ఎట్టకేలకు కోవిషీల్డ్ టీకా అందించే దేశాలైన భారత్, నేపాల్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులు, బంగ్లాదేశ్ కు చెందిన వారు బెల్జీయంకు వెళ్లేందుకు అనుమతి లభించింది. జూలై 7న బెల్జీయం కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను తమ దేశంలోకి అనుమతించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈయూ ఆమోదం తెలిపిన దేశాల్లో స్విట్జర్లాండ్, ఐస్‌లాండ్, ఆస్ట్రియా, బల్గేరియా, ఫిన్లాండ్, జర్మనీ, గ్రీస్, హంగేరీ, ఐర్లాండ్, లాట్వీయా, నెదర్లాండ్, స్లోవేనియా, స్పెయిన్, స్వీడన్ ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇప్పుడు ఈ 15 దేశాలు కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న ప్రయాణికులను తమ దేశంలోకి అనుమతిస్తాయని ట్వీట్‌ చేశారు. యూరప్‌లో ఉద్యోగం కోసం, పర్యాటకుల కోసం ఈ గ్రీన్ పాస్ తప్పనిసరి చేశాయి. ఇప్పటికే నాలుగు టీకాలను యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (EMA) ఆమోదించింది. EU సభ్య దేశాలకు వచ్చేవారిలో ఎవరైనా ఫైజర్ , బయోఎంటెక్, మోడెర్నా, ఆస్ట్రాజెనెకా, జాన్సెన్ వ్యాక్సిన్లు వేయించుకుంటే మాత్రమే అనుమతించాలని ఈయూ నిర్ణయించింది. అయితే ఇప్పుడు కొవిషీల్డ్ తీసుకున్న వారికి కూడా అనుమతించనున్నట్టు పేర్కొంది.