తెల్ల కిట్టమ్మ : చిన్నారి సంగీతానికి పరుగులు పెడుతూ వచ్చేస్తున్న ఆవులు

తెల్ల కిట్టమ్మ : చిన్నారి సంగీతానికి పరుగులు పెడుతూ వచ్చేస్తున్న ఆవులు

cows attract music played by a small girl just like magic : గోకులంలో శ్రీకృష్ణుడు వేణువు వాయిస్తే ఆ రాగానికి పశు పక్ష్యాదులన్నీ చెవులు రిక్కించి వినేవట. గోకులంలో గోపికలైతే ఆ కిట్టయ్య వేణుగానానికి మైమరచిపోయేవారట. ఆ నంద గోపాలుడు వేణుగానానికి గోవులు తలలు ఊపుతూ పరవశించిపోయేవని పురాణ కథల్లో చదువుకున్నాం. సంగీతానికి రాళ్లు కూడా కరిగిపోతాయని కూడా చదువుకున్నాం.

అవికథలో నిజాలో అనేది ముఖ్యం కాదు. కానీ చక్కని సంగీతం ఒత్తిడిని తగ్గిస్తుందని నిపుణులు సైతం చెబుతున్నారు. అలనాడు నల్లనయ్య వేణుగానానికి ఆవులన్నీ ఎలా ఆకర్షితులయ్యి మైమరచిపోయేవో..ఇప్పుడీ తెల్లని చిన్నారి సంగీతానికి ఎక్కడో దూరంగా ఉండే ఆవులు పరుగులు పెట్టుకుంటూ వచ్చి వింటున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

శ్రీకృష్ణుడి వేణువులాగే..చిముర్దీ అనే ఓ సంగీత వాయిద్యం కూడా గోవుల్ని ఆకర్షిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలో ఓ చిన్నారి కంచెకు ఇవతల కూర్చొని… చిముర్దీని వాయిస్తోంది. దాని నుంచి ప్రత్యేకమైన సంగీతం వినిపిస్తోంది.

ఆ వాయిద్యం సౌండ్ విన్న ఎక్కడో దూరంగా ఉండే ఆవున్నీ పరిగెడుతూ రావడం మొదలుపెట్టాయి. తన వాయిద్యాన్ని వినేందుకే అవి వస్తున్నాయి అని నిరూపించేందుకు ఆ చిన్నారి. ఆవులు సగం దూరం వచ్చాక… వాయించడం ఆపేసింది. దాంతో ఆవులు… రావడం ఆపేశాయి.

మళ్లీ పాప వాయించగానే రావడం మొదలుపెట్టాయి. కంచెకు అవతల ఆవులు ఆ మ్యూజిక్ వింటుంటే… ఇవతల ఆ చిన్నారి తెగ సంబరపడిపోయింది. ఆ ఆవులు అన్నీ ఒకేసారి అలా పరుగెత్తుకుంటూ రావటంతో సంగీతానికి పశుపక్ష్యాదులను ఆకర్షించే శక్తి ఉందని నమ్మాల్సిందే ననటంలో ఎటువంటి సందేహం లేదు.మరి మీరు కూడా చూడండీ ఈ వీడియోను..ఈ వీడియో పోస్ట్ చేసి ఎన్ని నెలలు అయినా ఇప్పటికీ నెటిజన్లు ఈ వీడియో ఆకట్టుకుంటూనే ఉంది.

పశువుల్ని ఆకట్టుకునే మరి వీడియోలు మీకోసం చూడండీ..సంగీతాన్ని ఆస్వాదించండీ..