American Flag : పిల్లిని కాపాడిన అమెరికా జెండా

మ్యాచ్ చూస్తుండగా..ఓ పిల్లి స్టేడియం గ్యాలరీ అంచున వేలాడుతూ కనిపించింది. దానిని ఎలా కాపాడాలో అక్కడున్న ప్రేక్షకులకు అర్థం కాలేదు.

American Flag : పిల్లిని కాపాడిన అమెరికా జెండా

Cat

Hard Rock Cat : అమెరికా జెండా పిల్లిని కాపాడడం ఏంటీ ? అని ఆశ్చర్యపోతున్నారా ? అలాగే జరిగింది. అమెరికా జెండాను పెట్టి..పిల్లిని కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అందరూ మ్యాచ్ చూస్తుండగా..ఓ పిల్లి స్టేడియం గ్యాలరీ అంచున వేలాడుతూ కనిపించింది. దానిని ఎలా కాపాడాలో అక్కడున్న ప్రేక్షకులకు అర్థం కాలేదు. చేతులతో పట్టుకుంటే..ఎక్కడ కిందపడిపోతుందనే అనుమానాలు కలిగాయి. వెంటనే చేతిలో ఉన్న జెండాను తీసి…అందరూ కలిసి పట్టుకున్నారు. పట్టు కోల్పోయిన పిల్లి..ఆ జెండాలో పడిపోయింది. ఎలాంటి గాయాలు కాకుండా..అది ప్రాణాలతో బయటపడింది.

Read More : China Best Cars : ప్రపంచంలోనే అత్యుత్తమ కార్లను తయారుచేస్తున్న డ్రాగన్ చైనా!

మయామి హరికేన్స్ యూనివర్సిటీ, అప్పలాచియన్ స్టేట్ మధ్య పుట్ బాల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ చూసేందుకు ఇరు జట్ల అభిమానులు స్టేడియానికి తరలివచ్చారు. వారి అనుకూలమైన జెండాలు, ప్ల కార్డులు, టీషర్టులు ధరించి వచ్చారు. మ్యాచ్ లో అందరూ లీనమై పోయారు. అకస్మాత్తుగా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఓ పిల్లి. అటూ..ఇటూ వెళ్లి..గ్యాలరీ అంచుని పట్టుకుని వేలాడుతూ కనిపించింది. కింద కూర్చొన్న వారు అలర్ట్ అయ్యారు.

Read More : Horror Movies: బంపర్ అఫర్.. ఈ హార్ర‌ర్ సినిమాలు చూస్తే రూ.ల‌క్ష పారితోష‌కం!

అప్పటి వరకు రెండు చేతులతో పట్టుకున్న పిల్లి..అటూ ఇటూ..చూడసాగింది. ఒక్కసారిగా ఓ చేయి పట్టుకోల్పోయింది. మరో చేతితో పట్టుకుని పిల్లి వేలాడింది. కిందనున్న వారు అమెరికా జెండా తీసి..పట్టుకున్నారు. పట్టుకోల్పోయిన పిల్లి..అమాంతం జెండాపై పడి కింద పడిపోయింది. పిల్లి క్షేమంగా ఉందంటూ..పైకి ఎత్తి చూపారు. ఇదంతా చూస్తున్న ప్రేక్షకులు..చేతులతో చపట్లు కొట్టారు. పిల్లిని కాపాడిన వారిని నెటిజన్లు అభినందిస్తున్నారు.