Earthquake In China: 93కి చేరిన మృతుల సంఖ్య, మరో 25 మంది కోసం గాలింపు

రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.6గా నమోదయినట్టు అధికారులు తెలిపారు. ఇది సుమారు 43 కిలోమీటర్ల మేర ప్రభావం చూపిందట. ఈ భూకంపం కారణంగా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించిందని స్థానిక అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ విషయమై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని వారు పేర్కొన్నారు. ప్రాథమిక వార్తల ప్రకారం, సిచువాన్ ప్రావిన్స్‌లోని పలు పట్టణాల్లో కొండచరియలు విరిగిపడి ఇళ్లు తీవ్రంగా దెబ్బతినట్టు తెలుస్తోంది. పలు ఏరియాల్లో టెలి కమ్యూనికేషన్ లైన్లు తెగిపోయాయి.

Earthquake In China: 93కి చేరిన మృతుల సంఖ్య, మరో 25 మంది కోసం గాలింపు

Death toll from western China earthquake rises to 93

Earthquake In China: చైనాలో సంభవించిన భారీ భూకంపం మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మృతుల సంఖ్య 93కు చేరుకున్నట్లు చైనా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ ప్రమాదం కారణంగా కనిపించకుండా పోయిన 25 మంది కోసం ఇంకా గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. భూకంపం అనంతరం భారీగా ఆస్తినష్టం సంభవించింది. సమీ ప్రాంతాలు పెద్ద ఎత్తున ధ్వంసం కావడంతో సుమారు 50,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చైనా ప్రభుత్వ మీడియా సీసీటీవీ పేర్కొంది.

రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.6గా నమోదయినట్టు అధికారులు తెలిపారు. ఇది సుమారు 43 కిలోమీటర్ల మేర ప్రభావం చూపిందట. ఈ భూకంపం కారణంగా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించిందని స్థానిక అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ విషయమై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని వారు పేర్కొన్నారు. ప్రాథమిక వార్తల ప్రకారం, సిచువాన్ ప్రావిన్స్‌లోని పలు పట్టణాల్లో కొండచరియలు విరిగిపడి ఇళ్లు తీవ్రంగా దెబ్బతినట్టు తెలుస్తోంది. పలు ఏరియాల్లో టెలి కమ్యూనికేషన్ లైన్లు తెగిపోయాయి.

రాజధాని చెంగ్డు, దానికి సమీపంలోని చాంగ్వింగ్ మెగాసిటీ సమీపంలో పలు భవంతులు కొద్ది సెకన్లు కంపించాయని చెబుతున్నారు. సహాయక చర్యల కోసం 500 మందికి పైగా సహాయ సిబ్బంది రంగంలోకి దింపారు. టిబెట్‌కు ఆనుకుని ఉన్న సిచువాన్ ప్రావిన్స్‌లో తరచు భూపంకంపాలు చోటుచేసుకుంటూ ఉంటాయి. టిబెట్ పీఠభూమిలోనూ భూకంపాలు నమోదవుతుంటాయి.

Fire Broke Out In Secunderabad: ఈ స్కూటర్ల షోరూంలో భారీ అగ్ని ప్రమాదం.. 8 మంది సజీవ దహనం