Afghanistan bomb blast : అఫ్ఘానిస్థాన్ లో మరోసారి బాంబు దాడి..33 మంది మృతి

అఫ్ఘానిస్థాన్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది.కుందుజ్ ప్రావిన్స్ లోని మసీదుపై ఉగ్రవాదులు బాంబులతో విరుచుకుపడ్డారు. ఈ పేలుళ్లలో 33మంది మరణించారు. మరో 45 మంది వరకు తీవ్ర గాయాలపాలయ్యారు.

Afghanistan bomb blast : అఫ్ఘానిస్థాన్ లో మరోసారి బాంబు దాడి..33 మంది మృతి

Afghanistan Bomb Blast

Afghanistan bomb blast :  అఫ్ఘానిస్థాన్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. రెండు రోజుల క్రితమే పాఠశాలల్లో వరుస బాంబు పేలుళ్లతో దాదాపు 20మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈక్రమంలో మరో అఫ్ఘాన్ లో బాంబులతో దద్దరిల్లిపోయింది. కుందుజ్ ప్రావిన్స్ లోని మసీదుపై ఉగ్రవాదులు బాంబులతో విరుచుకుపడ్డారు. ఈ పేలుళ్లలో 33మంది మరణించారు. మరో 45 మంది వరకు తీవ్ర గాయాలపాలయ్యారు.ఇటీవల పాఠశాలల్లో వరుస బాంబుపేలుళ్లతో ఉలిక్కిపడిన ఆఫ్ఘనిస్థాన్ ప్రజలు మరో భీకర బాంబు దాడి ఘటనతో భయకంపితులవుతున్నారు. తాజాగా కుందుజ్ ప్రావిన్స్ లోని ఓ మసీదు బాంబు దాడులతో దద్దరిల్లింది. శుక్రవారం (ఏప్రిల్ 22,2022)ఇమామ్ సాహిబ్ జిల్లాలోని మవ్లావీ సికందర్ మసీదుపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు.

Also read : Afghanistan Bomb blasts : అప్ఘానిస్థాన్ లో వరుస బాంబు పేలుళ్లు..18 మంది మృతి, 65 మందికి తీవ్ర గాయాలు

ఈ బాంబు దాడిలో 33 మంది మరణించారు. 43 మంది గాయపడ్డారు. మృతి చెందినవారిలో పిల్లలు కూడా ఉన్నారని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వెల్లడించారు. ఈ ఘాతుకాన్ని తాము ఖండిస్తున్నామని, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నామని పేర్కొన్నారు.

2021లో తాలిబన్లు అఫ్ఘానిస్థాన ను హస్తగతం చేసుకుని అధికారం చేపట్టాక జరిగిన అతిపెద్ద దాడుల్లో ఇదొకటిగా భావిస్తున్నారు. ఇది కూడా ఐసిస్ పనే అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అఫ్ఘానిస్థాన్ లోని షియా, సూఫీ మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసిన చరిత్ర ఐసిస్ కు ఉంది. ఇప్పుడు దాడి జరిగిన మసీదు కూడా సూఫీ ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతానికి చెందినది.

ISIS వంటి జిహాదిస్ట్ గ్రూపులు మతవిశ్వాసులుగా భావించే సూఫీల పట్ల తీవ్ర ద్వేషాన్ని కలిగి ఉంటారు. దీంతో వారు ఉన్న ప్రాంతాల్లోనే ఈ దాడులకు పాల్పడుతుంటారు. పేలుడు జరిగిన మసీదు దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. మృతదేహాలు ఎక్కడిక్కడ చెల్లా చెదురుగా పడి ఉండటం చూసిన ఎవ్వరికైనా ఈ దృశ్యాలు భయం కలిగించేలా ఉన్నాయి. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.

Also read : Number plate : బాబోయ్.. నెంబర్ ప్లేట్ ధర రూ. 70కోట్లు.. అక్కడంతేనట..

కాగా రెండు రోజుల క్రితం అఫ్ఘాన్ రాజధాని కాబుల్‌తో సహా ఐదు చోట్లు పేలుళ్లు సంభవించాయి. ప్రార్థనా మందిరంలో ఒక్కసారిగా భారీ పేలుళ్లు జరిగాయి. ఈ బాంబు దాడుల్లో 18 మంది మరణించారు. మరో 65 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.