China Rocket Debris : భూమిపైకి దూసుకొస్తున్న చైనా రాకెట్ శిధిలాలు.. అంతర్జాతీయ జలాల్లో పడే అవకాశం.. ముప్పు తప్పినట్టేనా?

చైనా ప్రయోగించిన అతిపెద్ద రాకెట్ నియంత్రణ కోల్పోయి భూమి చుట్టూ తిరుగుతోంది.. అదే ఏ క్షణంలోనైనా భూమిపై పడే ప్రమాదం ఉందని చైనా అంతరిక్ష పరిశోధనా సంస్థ హెచ్చరిస్తోంది. 21 టన్నుల బరువున్న చైనా లాంగ్ మార్చ్ 5B అతిపెద్ద రాకెట్ నియంత్రణ కోల్పోయి భూమి చుట్టూ తిరుగుతోంది.

China Rocket Debris : భూమిపైకి దూసుకొస్తున్న చైనా రాకెట్ శిధిలాలు.. అంతర్జాతీయ జలాల్లో పడే అవకాశం.. ముప్పు తప్పినట్టేనా?

Debris From China Space Rocket Likely To Fall In International Waters

China Space Rocket Debris : చైనా ప్రయోగించిన అతిపెద్ద రాకెట్ నియంత్రణ కోల్పోయి భూమి చుట్టూ తిరుగుతోంది.. అదే ఏ క్షణంలోనైనా భూమిపై పడే ప్రమాదం ఉందని చైనా అంతరిక్ష పరిశోధనా సంస్థ హెచ్చరిస్తోంది. 21 టన్నుల బరువున్న చైనా లాంగ్ మార్చ్ 5B అతిపెద్ద రాకెట్ నియంత్రణ కోల్పోయి భూమి చుట్టూ తిరుగుతోంది. రానున్న రోజుల్లో రాకెట్ శిధిలాలు తిరిగి భూమిపై పడిపోయే ఉందని ఇటీవలే పరిశోధకులు హెచ్చరించారు. కానీ, ఇప్పుడు ఆ చైనా రాకెట్ నుంచి శిధిలాలు అంతర్జాతీయ జలాల్లో పడే అవకాశం ఉందని చైనా గ్లోబల్ టైమ్స్ నివేదించింది.

గత వారమే అంతరిక్ష కేంద్రంలో కొంత భాగాన్ని కక్ష్యలోకి పంపిన చైనా రాకెట్ ఒక్కసారిగా పేలిపోయింది. దాంతో ఆ రాకెట్ నుంచి శిధిలాలు భూమిపైకి దూసుకొచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. లాంగ్ మార్చి 5 బి రాకెట్ ఏప్రిల్ 29న హైనాన్ ద్వీపం నుంచి టియాన్హే మాడ్యూల్‌ను ప్రయోగించింది. 2022 నాటి కల్లా సొంతంగా ఓ స్పేస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ శాశ్వత చైనీస్ అంతరిక్ష కేంద్రంలో ముగ్గురు సిబ్బందికి నివాసంగా మారనుంది. రాకెట్ శిధిలాలు భూమికిపైకి ఏ క్షణంలోనైనా దూసుకురావొచ్చు.. అయితే రాకెట్ రీ-ఎంట్రీ పాయింట్ ఎక్కడ పడుతుందనేది అస్పష్టంగానే ఉంది. పేలిన రాకెట్ నియంత్రణలో లేదు.. అయినప్పటికీ భయపడాల్సిన అవసరం లేదని నివేదిక చెబుతోంది.

Rocket China

రాకెట్.. రీ ఎంట్రీ సమయంలో భూ వాతావరణంలోకి ప్రవేశించగానే చాలావరకు శిధిలాలు కాలిపోతాయి. భూమిపైకి చాలా చిన్న భాగం మాత్రమే వచ్చే అవకాశం ఉందంటున్నారు. అయితే మానవ కార్యకలాపాలకు లేదా సముద్రంలో దూరంగా ఉన్న ప్రాంతాలలో రాకెట్ దిగడానికి అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. యుఎస్ స్పేస్ కమాండ్ రాకెట్ స్థానాన్ని ట్రాక్ చేస్తోంది. మే 8న లాంగ్ మార్చి 5 బి రాకెట్ రీ-ఎంట్రీ ఉంటుందని భావిస్తున్నట్లు రక్షణ శాఖ తెలిపింది. రాకెట్ శిధిలాలు అంతరిక్ష ప్రయాణ భద్రతకు, అంతరిక్ష క్షేత్రానికి ముప్పుగా ఉంటాయని పెంటగాన్ తెలిపింది.

కాలిఫోర్నియాలోని 18వ అంతరిక్ష నియంత్రణ స్క్వాడ్రన్ మే 4 నుంచి రాకెట్ శిధిలాలు పడిన స్థానం గురించి ఎప్పటికప్పుడూ అప్ డేట్స్ అందిస్తుందని పేర్కొంది. చైనా సొంత అంతరిక్ష పర్యవేక్షణ నెట్‌వర్క్ రాకెట్ ఫ్లైట్ కోర్సు పరిధిలోని ప్రాంతాలను నిశితంగా గమనిస్తుంది. ప్రయాణిస్తున్న నౌకలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటుంది. లాంగ్ మార్చి 5బి రాకెట్ లో ఉపయోగించిన ఇంధనం.. పర్యావరణ అనుకూల ఇంధనమని, అది సముద్రాన్ని కలుషితం చేయదని నిపుణులు భావిస్తున్నారు.