Delta Variant: ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొవిడ్ కేసుల్లో మూడొంతులు డెల్టా వేరియంట్‌దే

ప్రపంచవ్యాప్తంగా నాలుగు వారాల నుంచి భారత్, చైనా, రష్యా, ఇజ్రాయెల్, యూకే లాంటి దేశాల్లో పరీక్షించిన కోవిడ్‌–19 శాంపిళ్లలో 75% కేసులు డెల్టా వేరియంట్‌కు చెందినవే. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.

Delta Variant: ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొవిడ్ కేసుల్లో మూడొంతులు డెల్టా వేరియంట్‌దే

Delta Variant (2)

Delta Variant: ప్రపంచవ్యాప్తంగా నాలుగు వారాల నుంచి భారత్, చైనా, రష్యా, ఇజ్రాయెల్, యూకే లాంటి దేశాల్లో పరీక్షించిన కోవిడ్‌–19 శాంపిళ్లలో 75% కేసులు డెల్టా వేరియంట్‌కు చెందినవే. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. అనేక దేశాలు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కవరేజీని విస్తృతం చేసినప్పటికీ, అన్ని ప్రాంతాల్లోనూ కేసుల్లో పెరుగుదల నమోదైందని జులై 20న విడుదల చేసిన రిపోర్టులో పేర్కొంది.

వారం రోజులుగా ఇండోనేసియాలో అత్యధికంగా 44% పెరుగుదలతో 3లక్షల 50వేల 273 కేసులు నమోదయ్యాయి. యూకేలో 41% పెరుగుదలతో 2లక్షల 96వేల 447 కేసులు, బ్రెజిల్‌ 14% పెరుగుదలతో 2లక్షల 87వేల 610 కొత్త కేసులు, భారత్‌లో 2 లక్షల 68వేల 843 కొత్త కేసులతో 8 శాతం పెరుగుదల, అమెరికాలో 2లక్షల 16వేల 433 కొత్త కరోనా వైరస్‌ కేసులతో 68% పెరుగుదల నమోదైనట్లు వివరించింది.

జీఐఎస్‌ఎయిడ్‌ (GISID) సంస్థ జూలై 20వ తేదీన వెల్లడించిన వివరాల ప్రకారం.. మొత్తం 2లక్షల 40వేల శాంపిళ్లలో 2లక్షల 20వేల శాంపిళ్లు డెల్టా వేరియంట్‌వేనని నిర్థారించింది. అంతేకాకుండా రాబోయే కొద్ది నెలల వరకూ డెల్టా వేరియంట్‌ కేసులే ఎక్కువగా ఉండే అవశాలున్నాయని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. భారత్‌లో నమోదవుతున్న కోవిడ్‌ కేసుల్లో అత్యధికం డెల్టా వేరియంట్‌వే ఉంటున్నాయని కరోనా జన్యుక్రమాన్ని శోధించే వేదిక ఇన్సాకాగ్‌ వెల్లడించింది.