Ant Population On Earth: భూమిపై ఎన్ని చీమలు ఉన్నాయో తెలుసా..? పరిశోధకులు ఎలా లెక్కించారంటే..
హాంకాంగ్‌కు చెందిన కొందరు పరిశోధకులు పెద్ద సాహసానికి పూనుకున్నారు. ఈ భూగోళంపై ఎన్ని చీమలు నివసిస్తున్నాయి? వాటి సంఖ్య ఎంత ఉంటుందనే విషయంపై అధ్యయనం చేశారు.

ants population
Ant Population On Earth: హాంకాంగ్‌కు చెందిన కొందరు పరిశోధకులు పెద్ద సాహసానికి పూనుకున్నారు. ఈ భూగోళంపై ఎన్ని చీమలు నివసిస్తున్నాయి? వాటి సంఖ్య ఎంత ఉంటుందనే విషయంపై అధ్యయనం చేశారు. సాధారణంగా భూగోళంపై మానవుల కంటే చీమల సంఖ్య ఎక్కువగా ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎంతశాతం చీమలు ఎక్కువగా ఉంటాయనేది సమాదానం దొరకని ప్రశ్నగానే ఉది. తాజాగా హాంకాంగ్ పరిశోధకులు చీమల సంఖ్యను లెక్కగట్టే ప్రయత్నం చేశారు. ఇందుకోసం 489 అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం ద్వారా భూమిపై చీమల సంఖ్యపై ఓ నిర్ధారణకు వచ్చారు.
Aadhaar Photo Update : మీ ఆధార్ కార్డ్‌లో ఫొటో ఎలా అప్‌డేట్ చేయాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!
భూమిపై 20,000,000,000,000,000 లేదా 20 క్వాడ్రిలియన్ల చీమలు ఉన్నాయని హాంకాంగ్‌కు చెందిన పరిశోధకుల బృందం అంచనా వేసింది. అయితే ఇది కచ్చితమైన సంఖ్య మాత్రం కాదు. కచ్చితమైన సంఖ్యను చెప్పలేక పోతున్నామని తెలిపారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చీమల సాంద్రతను కొలిచే 489 అధ్యయనాల నుంచి డేటాను సంకలనం చేయడం ద్వారా ఈ సంఖ్యను 20 క్యాడ్రిలియన్‌లుగా విభజించినట్లు తెలిపారు. అయితే భూమిపై 20 క్వాడ్రిలియన్ల చీమల జనాభా మానవుల జనాభా కంటే 2.5 మిలియన్ రెట్లు ఎక్కువ అని అధ్యయనం కనుగొంది.
ఈ పరిశోధనలు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రొసీడింగ్స్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి. భూగోళం మీద చీమల బయోమాస్ ను కూడా ఈ బృందం వెల్లడించింది. 12 మిలియన్ టన్నులుగా పేర్కొంది. అడవిలో నివసించే పక్షులు, క్షీరదాల మొత్తం బరువు కలిపి సుమారు 2 మిలియన్ టన్నులు ఉంటుందని పరిశోధకులు తెలిపారు.