New Year Celebrations: ప్రపంచంలో తొలుత ఏ దేశంలో న్యూ ఇయర్‌కు స్వాగతం పలుకుతారో తెలుసా?

ప్రపంచ దేశాల్లో ఆయా సమయాలను బట్టి న్యూ ఇయర్ వేడుకలు మొదలవుతాయి. కొన్ని దేశాల్లో 2023 సంవత్సరం ముందుగానే వస్తుంది. భారత్ కాలమానం ప్రకారంతో పోల్చితే.. భారత్‌లో కంటే కొన్నిగంటల ముందే పలు దేశాల్లో ప్రజలు 2023 సంవత్సరంలోకి అడుగు పెడతారు.

New Year Celebrations: ప్రపంచంలో తొలుత ఏ దేశంలో న్యూ ఇయర్‌కు స్వాగతం పలుకుతారో తెలుసా?

New Year

New Year Celebrations: మరికొద్ది గంటల్లో 2023 సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ప్రపంచ వ్యాప్తంగా నూతన ఏడాదికి ఘనంగా స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. డిసెంబర్ 31న రాత్రి న్యూ ఇయర్ వేడుకల సంబరాలు అంబరాన్నితాకేలా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారత్‌లోని ప్రధాన నగరాల్లో 2023 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వేడుకలు జరుపుకొనేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

New Year Celebrations : నూతన సంవత్సర వేడుకలకు కొత్త రూల్స్.. డ్రగ్స్, ఆయుధాలు నిషేధం

ప్రపంచ దేశాల్లో ఆయా సమయాలను బట్టి న్యూ ఇయర్ వేడుకలు మొదలవుతాయి. కొన్ని దేశాల్లో 2023 సంవత్సరం ముందుగానే వస్తుంది. భారత్ కాలమానం ప్రకారంతో పోల్చితే.. భారత్‌లో కంటే కొన్నిగంటల ముందే పలు దేశాల్లో ప్రజలు 2023 సంవత్సరంలోకి అడుగు పెడతారు. ఓషియానియా ప్రాంత ప్రజలు ముందుగా 2023 సంవత్సరంకు స్వాగతం పలికుతారు. వీటిలో టోంగా, సమోవా, కిరిబాటి దేశాలు కొత్త సంవత్సరానికి ముందుగా స్వాగతం పలికే దేశాల్లో ఉన్నాయి. పసిఫిక్ ద్వీపం టోంగాలో నూతన సంవత్సర వేడుకలు తొలుత ప్రారంభమవుతాయి.

Jio Happy New Year 2023 Plan : రిలయన్స్ జియో న్యూ ఇయర్ 2023 ప్లాన్ వచ్చేసిందోచ్.. అన్‌లిమిటెడ్ కాలింగ్, మరెన్నో డేటా బెనిఫిట్స్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

భారత కాలమానం ప్రకారం.. డిసెంబర్ 31న మధ్యాహ్నం 3.30 గంటలకే సమోవా, క్రిస్మస్ ద్వీపం / కిరిబాటి ప్రజలు 2023 సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఆసియా దేశాల్లో జపాన్, దక్షిణ కొరియాలో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఇక్కడ భారత కాలమానం ప్రకారం.. డిసెంబర్ 31న రాత్రి 8.30 గంటలకు 2023 సంవత్సరానికి అక్కడి ప్రజలు స్వాగతం పలుకుతారు. అయితే, చివరిగా 2023 సంవత్సరానికి స్వాగతం పలికే దేశాల్లో అవుట్ లైయింగ్ ఐలాండ్ లో చివరిగా జరుపుకుంటారు. అంటే, భారత కాలమానం ప్రకారం.. జనవరి 1వ తేదీ సాయంత్రం 5.35 గంటలకు అక్కడ నూతన సంవత్సరానికి స్వాగతం పలకనున్నారు.