Jio Happy New Year 2023 Plan : రిలయన్స్ జియో న్యూ ఇయర్ 2023 ప్లాన్ వచ్చేసిందోచ్.. అన్‌లిమిటెడ్ కాలింగ్, మరెన్నో డేటా బెనిఫిట్స్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

Jio Happy New Year 2023 Plan : మరికొద్దిరోజుల్లో 2022 సంవత్సరం ముగుస్తోంది. ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) కంపెనీ 2023 కొత్త ఏడాది సందర్భంగా రూ. 2023 ధరతో కొత్త హ్యాపీ న్యూ ఇయర్ 2023 ప్లాన్‌ (Jio Happy New Year 2023 Plan)ను ప్రారంభించింది.

Jio Happy New Year 2023 Plan : రిలయన్స్ జియో న్యూ ఇయర్ 2023 ప్లాన్ వచ్చేసిందోచ్.. అన్‌లిమిటెడ్ కాలింగ్, మరెన్నో డేటా బెనిఫిట్స్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

Jio Happy New Year 2023 plan launched, offers 2.5GB data per day and unlimited calls at Rs 2023

Jio Happy New Year 2023 Plan : మరికొద్దిరోజుల్లో 2022 సంవత్సరం ముగుస్తోంది. ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) కంపెనీ 2023 కొత్త ఏడాది సందర్భంగా రూ. 2023 ధరతో కొత్త హ్యాపీ న్యూ ఇయర్ 2023 ప్లాన్‌ (Jio Happy New Year 2023 Plan)ను ప్రారంభించింది. రిలయన్స్ జియో ప్రతి ఏడాదిలో కొత్త సంవత్సర ప్లాన్ ప్రవేశపెడుతుంది.

ఈ సంవత్సరం కూడా రూ. 2023 ధరతో కొత్త జియో హ్యాపీ న్యూ ఇయర్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ జియో ప్లాన్ 252 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్, చాలా డేటాను అందిస్తుంది. జియో అందించే రూ. 2023 ప్లాన్ ఇప్పుడు Jio.comలో అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌కు సభ్యత్వం పొందాల్సిన వినియోగదారులు కేవలం MyJio యాప్ లేదా Google Pay, PhonePeతో సహా ఏదైనా థర్డ్ పార్టీ మొబైల్ రీఛార్జ్ ప్లాట్‌ఫారమ్‌లకు వెళ్లవచ్చు.

Jio Happy New Year 2023 plan launched, offers 2.5GB data per day and unlimited calls at Rs 2023

Jio Happy New Year 2023 plan launched, offers 2.5GB data per day

ఇప్పుడు, కొత్త జియో హ్యాపీ న్యూ ఇయర్ ప్లాన్ (Jio Happy New Year 2023 plan) అందించే బెనిఫిట్స్ ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. రూ. 2023 జియో కొత్త ప్లాన్ 252 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. 9 నెలల పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ రోజుకు 2.5GB డేటాను కూడా అందిస్తుంది. ఇది వ్యాలిడిటీ వ్యవధికి దాదాపు 630GB డేటాను అందిస్తుంది. అదనంగా, రూ. 2023 ప్లాన్ Jio యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్, రోజుకు 100 SMSలను అందిస్తుంది. న్యూ ఇయర్ ఆఫర్ కింద.. జియో కొత్త సబ్‌స్క్రైబర్‌లకు కాంప్లిమెంటరీ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను కూడా అందిస్తోంది.

Read Also : Jio 5G on iPhone : మీ ఐఫోన్‌లో ఇప్పటికీ జియో 5G సపోర్టు చేయడం లేదా? ఈ లిస్టులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి.. జియో 5G ఫుల్ లిస్ట్ మీకోసం..!

కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ప్లాన్‌తో పాటు, జియో న్యూ ఇయర్ ఆఫర్ (Jio New Year Offer) ఇప్పటికే ఉన్న రూ. 2999 ప్లాన్‌కు అదనపు బెనిఫిట్స్ కూడా యాడ్ చేసింది. ప్రస్తుతం ఉన్న ఆఫర్లతో పాటు, రూ.2999 ప్లాన్ 75GB అదనపు హైస్పీడ్ డేటాతో పాటు 23 రోజుల అదనపు వ్యాలిడిటీని అందిస్తుంది. రీఛార్జ్ చేసిన అదే రోజున క్యాంపెయిన్ పోస్ట్ గో-లైవ్ ద్వారా 75GB అదనపు డేటాతో పాటు 23 రోజుల అదనపు వ్యాలిడిటీ వోచర్‌లు అందించనుంది. రూ. 2999 ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. మొత్తం 912.5GB డేటాను అందిస్తుంది. రోజుకు 2.5GB హైస్పీడ్ డేటా వస్తుంది.

Jio Happy New Year 2023 plan launched, offers 2.5GB data per day and unlimited calls at Rs 2023

Jio Happy New Year 2023 plan launched, offers 2.5GB data per day and unlimited calls at Rs 2023

అదనంగా, వార్షిక ప్లాన్ అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS, Jio యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తుంది. రిలయన్స్ జియో ప్రస్తుతం 3 వార్షిక ప్లాన్‌లను అందిస్తోంది. అందులో రూ. 2999, రూ. 2874, రూ. 2545 ప్లాన్లు ఉన్నాయి. రూ. 2874 ప్లాన్ అపరిమిత కాలింగ్ బెనిఫిట్స్ అందిస్తుంది. మొత్తం 730GB డేటాతో పాటు రోజుకు 2GB డేటా, రోజుకు 100SMS, Jio Suite యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్, 365 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. రూ. 2545 ప్లాన్ అన్‌‌లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్ అందిస్తుంది. మొత్తం 504GB డేటాతో పాటు రోజుకు 1.5GB డేటా, రోజుకు 100SMS, Jio సూట్ యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్, 336 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Reliance Jio Plan Offers : రిలయన్స్ జియోలో సరికొత్త ప్లాన్లు ఇవే.. 90 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, డేటా బెనిఫిట్స్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!