Donald Trump: అఫ్గాన్ నుంచి అమెరికా బలగాలు వెనక్కి వచ్చేటప్పుడు శునకాలను ఏం చేశారో చెప్పిన ట్రంప్
కుక్కలను అమెరికా ప్రజలు అమితంగా ఇష్టపడతారు, అఫ్గాన్ లో మాత్రం కుక్కలంటే విరక్తి, అసహ్యం కనబర్చుతారు తాలిబన్లు, ప్రజలు.

Donald Trump
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన విషయం తెలిపారు. అఫ్గానిస్థాన్ (Afghanistan) నుంచి అమెరికా బలగాలు తిరిగి వెళ్లిన సమయంలో ఆర్మీకి చెందిన శునకాలను తీసుకెళ్లలేదని చెప్పారు. దీంతో, కుక్కలను అమితంగా ఇష్టపడే అమెరికా ప్రజలు షాక్ అవుతున్నారు. ఆర్మీ శునకాల గురించి ట్రంప్ పలు వ్యాఖ్యలు చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా స్టోరీలు వస్తున్నాయి. ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
“అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలనా విభాగం అఫ్గానిస్థాన్ లో ఆర్మీ శునకాలను అలాగే వదిలేసింది. ప్రతి ఒక్క దాన్ని వారు వదిలేశారు. అమెరికా లొంగిపోయింది.. మొదట ఆర్మీని వెనక్కి పిలిపించింది. కోట్లాది రూపాలయ పరికరాలను అక్కడే వదిలేసింది” అని చెప్పారు. ఇందులో చైనా ప్రభావం కూడా ఉందని అన్నారు.
అఫ్గానిస్థాన్ ఆర్మీ శునకాలకు ఎలా వదిలేసి వస్తారంటూ అమెరికా ప్రజలు మండిపడుతున్నారు. కుక్కలను అమెరికా ప్రజలు అమితంగా ఇష్టపడతారు, అఫ్గాన్ లో మాత్రం కుక్కలంటే విరక్తి, అసహ్యం కనబర్చుతారు తాలిబన్లు, ప్రజలు.
కాగా, అఫ్గాన్ నుంచి అమెరికా దళాలు వెనక్కి వచ్చిన అనంతరం అఫ్గాన్ లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. బాలికలు, అమ్మాయిల జీవితాలు మరింత దుర్భరంగా మారాయని ఎన్నో నివేదికలు స్పష్టం చేశాయి. అఫ్గాన్ ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలవుతోంది.