China Warning: ”దంపతులు కలిసి పడుకోవద్దు.. ముద్దులు అస్సలు పెట్టుకోకూడదు”

చైనాలోని షాంగై పట్టణవాసులకు స్థానిక ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేశాయి. కొవిడ్-19 కారణంగా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో అక్కడి ప్రజల భద్రత మేరకు పలు ఆంక్షలు విధించారు.

China Warning: ”దంపతులు కలిసి పడుకోవద్దు.. ముద్దులు అస్సలు పెట్టుకోకూడదు”

China Covid Restrictions

Updated On : April 7, 2022 / 3:10 PM IST

China Warning: చైనాలోని షాంగై పట్టణవాసులకు స్థానిక ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేశాయి. కొవిడ్-19 కారణంగా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో అక్కడి ప్రజల భద్రత మేరకు పలు ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలోనే అక్కడి హెల్త్ వర్కర్లు మెగాఫోన్స్ పట్టుకుని పబ్లిక్ అనౌన్స్‌మెంట్స్ చేస్తున్నారు.

‘బుధవారం రాత్రి నుంచి దంపతులు కూడా కలిసి పడుకోకండి. ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడాన్ని అనుమతించడం లేదు. విడివిడిగా తినండి. సహకరిస్తున్నందుకు థ్యాంక్స్’ అంటూ హౌజింగ్ సొసైటీలో బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు.

వారం క్రితం రోబోల సహాయంతో షాంగై వీధుల్లో హెల్త్ సంబంధిత అనౌన్స్‌మెంట్స్ చేశారు. అక్కడి ప్రజల్లో ఆహార కొరత ఉండటంతో దాని గురించి తగు చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.

Read Also : చైనా, యుకేలో కరోనా కల్లోలం.. రికార్డు స్థాయిలో రోజువారీ కేసులు..!

‘షాంఘైలో బియ్యం, మాంసం వంటి సరిపడ వనరులు ఉన్నాయి. కాకపోతే డిస్ట్రిబ్యూట్ చేయడమే సమస్యగా మారింది. మహమ్మారి నియంత్రణలో భాగంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం’ అని షాంఘై వైస్ మేయర్ చెన్ తాంగ్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

త్వరలోనే హోల్‌సేల్ మార్కెట్లు, ఫుడ్ స్టోర్లు రీఓపెన్ చేస్తాం. లాక్‌డౌన్ ఏరియాల్లో పర్సనల్ గా డెలివరీ చేస్తామని అధికారులు చెప్తున్నారు.