కరోనాతో పాటు ఫ్లూ జ్వరం వచ్చిందా.. ఇక అంతే!!

కరోనాతో పాటు ఫ్లూ జ్వరం వచ్చిందా.. ఇక అంతే!!

పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ రీసెర్చ్.. రాబోయే చలికాలం గురించి సంచలన వార్త బయటపెట్టింది. కొవిడ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్న వారికి ఇదొక కీలక సమాచారం. సాధారణంగా వ్యాపించే కరోనా వైరస్ తో పాటుగా ఫ్లూ కూడా మొదలైతే డబుల్ రిస్క్ అని హెచ్చరించింది. ఇక దాదాపు ఇంటెన్సివ్ కేర్ లో ఉండాల్సిన పరిస్థితే.

దీనిపై అప్రమత్తమైన ఆరోగ్యశాఖ అధికారులు.. ఎన్‌హెచ్ఎస్‌ను కాపాడుకునేందుకు ఫ్లూ లక్షణాలున్న వారందరిపై స్టడీ నిర్వహించి తుది నిర్షయనికి వచ్చారు. చలికాలం దాటికి దాదాపు 1000మంది చనిపోతుంటే.. 30వేల మంది హాస్పిటల్స్ కు చేరుకుంటున్నారు.



పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ మెడికల్ డైరక్టర్ యొన్నె డోలె హెచ్చరిస్తూ.. ఇటువంటి లక్షణాలు ఉన్న వారు చాలా సీరియస్ సమస్యలో ఉన్నట్లు తేల్చారు. ఎవరిలోనైతే ఈ ఇన్ఫెక్షన్లు ఉంటాయో వారు చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే వాటిని భరించగలరు. కరోనా వైరస్ ఉన్న వారి నుంచి ఫ్లూను తప్పించడం చాలా కష్టం.

చాలా శరీర భాగాలు పూర్తిగా పనిచేయకుండా పోవచ్చు. కొన్ని మాత్రం చావు వరకూ తీసుకెళ్లే ప్రమాదాలు ఉన్నాయి. ఈ స్టడీలో భాగంగా 19వేల మందికి కొవిడ్, ఫ్లూ టెస్టులు నిర్వహించారు. 58కేసులను కనుగొన్న నిపుణులకు 43మంది చనిపోయినట్లు తెలిసింది. సాధారణంగా జనాభాలో 68శాతం మందిపై ఫ్లూ ప్రభావం ఉంటుంది. ఆ పరిస్థితుల్లో కరోనా వ్యాపిస్తే ఇక కష్టమే.

నిపుణుల అంచనా ప్రకారం.. రెండు వైరస్ లు ఒకదానితో ఒకటి పోటీపడి శరీర భాగాలపై ఎఫెక్ట్ చూపించాలనుకుంటాయి. అందుకే ఏదైనా లక్షణం కనిపించగానే దానికి మెడిసిన్ తీసుకుంటే ఒక వైరస్ తో పోటీ పడి గెలవొచ్చని చెబుతున్నారు.