Dove, Tresemmé: క్యాన్సర్ కారక రసాయనాలు.. ఆ షాంపూల్ని వెనక్కు తీసుకున్న కంపెనీ

క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నాయనే కారణంతో డవ్, ట్రెసెమె వంటి షాంపూల్ని వెనక్కు తీసుకుంది యునిలీవర్ సంస్థ. అమెరికాకు చెందిన ‘ఫుడ్ అండ్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్’ ఇచ్చిన నోటీసులు నేపథ్యంలో కంపెనీ ఈ చర్య తీసుకుంది.

Dove, Tresemmé: క్యాన్సర్ కారక రసాయనాలు.. ఆ షాంపూల్ని వెనక్కు తీసుకున్న కంపెనీ

Dove, Tresemmé: బ్యూటీ ప్రొడక్ట్స్‪‌లో క్యాన్సర్ కారక హానికర రసాయన పదార్థాలు ఉన్నాయనే కారణంతో చాలా సార్లు వాటిపై నిషేధం విధిస్తాయి ప్రభుత్వాలు. కొన్నిసార్లు కంపెనీలే తమ ఉత్పత్తుల్ని వెనక్కి తీసుకుంటాయి. తాజాగా ఇలాంటి పరిస్థితి తలెత్తింది అమెరికాలో.

WhatsApp: వాట్సాప్ నిలిచిపోవడానికి కారణం ఇదే.. కంపెనీ ఏం చెప్పిందంటే

యూనిలీవర్ కంపెనీకి చెందిన పలు డ్రై షాంపూ ఉత్పత్తుల్లో బెంజీన్ అనే రసాయనం ఉన్నట్లు, దీనివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నట్లు అమెరికాకు చెందిన ‘ఫుడ్ అండ్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్’ గుర్తించింది. దీంతో యునిలివర్ సంస్థకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హానికర పదార్థం ఉందని భావిస్తున్న డ్రై షాంపూలను కంపెనీ మార్కెట్ నుంచి వెనక్కు తీసుకుంది. వీటిలో ప్రఖ్యాత డవ్ షాంపూతోపాటు, ట్రెసెమే, నెక్సస్, టిగి, సావ్ అనే బ్రాండ్లు కూడా ఉన్నాయి. వీటిని మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ సురక్షత విషయంలో మరోసారి అనుమానాలు తలెత్తుతున్నాయి. వీటిలోని అనేక ఉత్పత్తుల్లో నిషేధిత, ప్రమాదకర, క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నట్లు చాలా సార్లు వెల్లడైంది.

Ghaziabad: పార్కింగ్ విషయంలో గొడవ.. తలపై ఇటుకతో కొట్టి వ్యక్తి హత్య.. వీడియోలో రికార్డైన ఘటన

కొన్నిసార్లు వీటిపై ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి. ప్రఖ్యాత జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థతోపాటు, ఎడ్జ్‌వెల్ పర్సనల్ కేర్ కంపెనీ వంటి అనేక సంస్థల ఉత్పత్తులపై నిషేధం విధించారు. అలాగే పీ&జీ (ప్రాక్టర్ అండ్ గ్యాంబిల్) సంస్థకు చెందిన ప్యాంటీన్ వంటి షాంపూల్ని కూడా నిషేధించారు. వీటిలో ఏరోసాల్స్ అనే పదార్థం ఉండటమే కారణం. ఇది కూడా క్యాన్సర్ కారకమే. అమెరికాలో తాజాగా పలు ఉత్పత్తులపై నిషేధం విధించిన నేపథ్యంలో, అవే సంస్థకు చెందిన ఇండియాలోని ఉత్పత్తులపై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే, ఈ విషయంలో ఇప్పటికిప్పుడు ఎలాంటి సమాచారం లేదు.