వ్యాక్సిన్ వేయించుకుంటే…20 శాతం ఆఫర్

వ్యాక్సిన్ వేయించుకుంటే…20 శాతం ఆఫర్

Dubai Restaurants : ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ను ఎదుర్కొనడానికి వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి పలు దేశాలు. ఇప్పటికే కొన్ని దేశాల్లో ప్రజలకు పంపిణీ చేశారు. కొన్ని దేశాలు..ఇతర దేశాలకు వ్యాక్సిన్ లను పంపిణీ చేస్తున్నాయి. భారతదేశంలో కూడా జోరుగా వ్యాక్సినేషన్ పంపిణీ జరుగుతోంది. అయితే..అక్కడక్కడ పలు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత..సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి.

దీంతో వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. ప్రభుత్వాలు నిర్దేశించుకున్న లక్ష్యం నెరవేరడం లేదు. గల్ప్ దేశాల్లో కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. యూఏఈలో ఇప్పటి వరకు మొత్తం 27 లక్షల మందికి వ్యాక్సిన్ వేసినట్లు అంచనా. ఇక్కడి ప్రభుత్వానికి పలు ప్రైవేటు సంస్థలు సహాయం అందిస్తున్నాయి. ఇదిలా ఉంటే…ప్రజలకు వ్యాక్సినేషన్ తీసుకోవడానికి ముందుకు వచ్చేందుకు పలు చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగా..ఓ రెస్టారెంట్ యాజమాన్యం వినూత్నంగా ముందుకొచ్చింది.

దుబాయ్ లోని బాబ్ ఆల్ షామ్స్ అనే రెస్టారెంట్ కొత్త ఆఫర్ ను ప్రకటించింది. వ్యాక్సిన్ వేయించుకున్న వ్యక్తులు తమ రెస్టారెంట్ లోకి వస్తే..అన్ని విభాగాల్లో 20 శాతం ఆఫర్ ఉంటుందని వెల్లడించింది. ఫస్ట్ డోస్ తీసుకుంటే..10 శాతం, రెండో డోస్ తీసుకున్న వారికి 20 శాతం ఆఫర్ ఉంటుందని తెలిపింది. ఈ ఆఫర్ కూడా ఏప్రిల్ 30వ తేదీ వరకు మాత్రమే ఉంటుందని యాజమాన్యం వెల్లడించింది. మరి…దీంతోనైనా..వ్యాక్సినేషన్ వేసుకోవడానికి ప్రజలు ముందుకు వస్తారా ? లేదా ? అనేది చూడాలి.