Dubai : ఒకరోజు షాపింగ్‌కి రూ.70 లక్షలు .. భర్త డబ్బు ఖర్చుచేయడం ఆమె హాబీనట

భర్త మిలియనీర్. అతని సంపాదన అంతా ఎలా ఖర్చుపెట్టాలా? అనుకుందేమో ఒకరోజు షాపింగ్ చేయమంటే అతని భార్య రూ.70 లక్షలు ఖర్చుపెట్టేస్తుందట. దుబాయ్‌లో ఉంటున్న ఈ జంట విలాసవంతమైన జీవితం చూస్తే ఆశ్చర్యమేస్తుంది.

Dubai : ఒకరోజు షాపింగ్‌కి రూ.70 లక్షలు .. భర్త డబ్బు ఖర్చుచేయడం ఆమె హాబీనట

Dubai

Millionaire Housewife: ఆడవారికి షాపింగ్ అంటే ఇష్టమే. కానీ భర్త సంపాదన అంతా నీరులా ఖర్చు పెట్టడమే హాబీగా మారితే ఎలా? దుబాయ్ లో ఓ మహిళ ఒకరోజు షాపింగ్ చేస్తే రూ. 70 లక్షలు ఖర్చుపెడుతుందట.

22-year-old millionaire : 17 ఏళ్లకు చదువుకు ఆపేశాడు.. 22 ఏళ్లకు మిలియనీర్ అయ్యాడు.. ఓ యువకుడి సక్సెస్‌ఫుల్ స్టోరి

దుబాయ్‌లో నివాసం ఉంటున్న జమాల్ మిలియనీర్. అతని భార్య సౌదీకి కోట్ల డబ్బు ఏం చేయాలో పాలుపోవట్లేదేమో? ఖర్చుపెట్టడమే పనట. టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్న సౌదీ ప్రతిరోజు లగ్జరీగా గడిపిన హాలీడే ట్రిప్స్‌కి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఇక భార్యాభర్తలిద్దరూ తమ మూడ్‌ని బట్టి రోజులో £3,600 (రూ.49,000) నుండి £72,000 (రూ.73,39,288.59) వరకు ఏదైనా ఒక షాపింగ్‌ కోసం ఖర్చు చేస్తారట. ఇక ఈ జంట మ్యాచింగ్ కార్లను వాడతారు. ఆమె భర్త ఆమెకు ఒక బిర్కిన్ బ్యాగ్.. రెండు కార్లను బహుమతిగా ఇచ్చాడు. ఇక తన చేతుల అందం కోసం సౌదీ తీసుకునే ట్రీట్మెంట్‌కి రూ. 63,000 ఖర్చు చేస్తుందట. భర్త జమాల్ £1,080 (సుమారు రూ. 96,000) ఖర్చుతో రెస్టారెంట్‌ను బుక్ చేయడమే కాదు.. ఆరోజు ఆమె ఎలాంటి దుస్తులు ధరించాలో చెబుతాడట.. అంతేకాకుండా కాస్ట్లీ సర్ప్రైజ్ గిఫ్ట్ ను కూడా ఇస్తాడట. ఇక ఇప్పటికే ఈ జంట ప్రపంచదేశాలు చుట్టి వచ్చారు.

Rickshaw Puller success story: రిక్షావాలా ఇప్పుడు మిలియనీర్.. IIT, IIM గ్రాడ్యుయేట్స్ కి ఉద్యోగాలిస్తున్నాడు..

సౌదీ ససెక్స్‌లో జన్మించింది. ఆమె భర్త అరేబియాకు చెందిన మిలియనీర్. ఆరేళ్ల వయసులో సౌదీ తన కుటుంబంతో దుబాయ్‌కి వచ్చింది. సౌదీ, జమాల్ ఓ యూనివర్సిటీలో చదువుకున్నారట. అయితే ఇద్దరూ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న తరువాత అవి పెటాకులై తిరిగి వీరిద్దరూ ఒక్కటయ్యారట. డైలీ స్టార్ లోని ఓ నివేదిక ప్రకారం సౌదీ, జమాల్‌ల స్టోరీ తెలుస్తోంది.