Ukraine War: మా గెలుపుతో లేదా ప్రపంచ వినాశనంతో యుద్ధం ముగుస్తుంది: పుతిన్ సలహాదారుడు  

ఉక్రెయిన్‌తో రష్యా చేస్తున్న యుద్ధం తమ దేశ గెలుపుతో లేదా ప్రపంచ వినాశనంతో ముగుస్తుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సలహాదారుడు, జాతీయవాది అలెగ్జాండర్ డుగిన్ అన్నారు. పుతిన్ కూడా ఇదే తీరుతో ఉన్నారని తెలుస్తోంది. ఉక్రెయిన్ తో కొన్ని నెలలుగా యుద్ధం చేస్తున్న రష్యా సేనలు పలు ప్రాంతాల నుంచి వెనకడుగు వేసిన విషయం తెలిసిందే.

Ukraine War: మా గెలుపుతో లేదా ప్రపంచ వినాశనంతో యుద్ధం ముగుస్తుంది: పుతిన్ సలహాదారుడు  

Russia is recruiting thieves and killers to fight war against Ukraine

Ukraine War: ఉక్రెయిన్‌తో రష్యా చేస్తున్న యుద్ధం తమ దేశ గెలుపుతో లేదా ప్రపంచ వినాశనంతో ముగుస్తుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సలహాదారుడు, జాతీయవాది అలెగ్జాండర్ డుగిన్ అన్నారు. పుతిన్ కూడా ఇదే తీరుతో ఉన్నారని తెలుస్తోంది. ఉక్రెయిన్ తో కొన్ని నెలలుగా యుద్ధం చేస్తున్న రష్యా సేనలు పలు ప్రాంతాల నుంచి వెనకడుగు వేసిన విషయం తెలిసిందే.

మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ దాడులు కొనసాగిస్తోంది. యుద్ధం ముగించాలని పలు దేశాలు సూచనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో అలెగ్జాండర్ డుగిన్ మాట్లాడారు. ప్రపంచంపై ఒకే దేశం ఆధిపత్యం చెలాయించడానికి వ్యతిరేకంగా అన్ని దేశాలూ శక్తిమంతంగా ఉండడానికి మద్దతుగా ఈ యుద్ధం జరుగుతోందని వ్యాఖ్యానించారు.

ఇది రష్యా, ఉక్రెయిన్, యూరప్ లకు సంబంధించిన యుద్ధం కాదని, అలాగే, పశ్చిమ, ఇతర దేశాలకు సంబంధించినదీ కాదని చెప్పారు. ‘ఇది ఆధిపత్యానికి వ్యతిరేకంగా మానవత్వ ప్రతిస్పందన’ అని చెప్పుకొచ్చారు. రెండు పరిస్థితుల్లో యుద్ధం ముగించే అవకాశాలు ఉన్నాయని, రష్యా గెలవాలని, లేదంటే ప్రపంచ వినాశనం జరగాలని చెప్పారు. విజయాన్ని తప్ప తాము ఏ పరిష్కారాన్నీ అంగీకరించబోమని తెలిపారు. కాగా, రష్యా భారీ విధ్వంసాలకు పాల్పడుతున్నప్పటికీ పలు దేశాల సాయంతో ఆ దాడులను ఉక్రెయిన్ ఎదుర్కొంటోంది.

Chandrababu Fired YCP : వైసీపీ గుండాలకు పోలీసులు కొమ్ముకాస్తున్నారని చంద్రబాబు ట్వీట్