Tesla : కార్ల అమ్మకాల్లో రికార్డ్ క్రియేట్ చేసిన ఎలాన్ మస్క్

టెస్లా ఎలక్ట్రిక్ కార్ల అధినేత ఎలాన్ మస్క్ కార్ల అమ్మకాల్లో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నారు.

Tesla : కార్ల అమ్మకాల్లో రికార్డ్ క్రియేట్ చేసిన ఎలాన్ మస్క్

Tesla

Tesla : ఎలక్ట్రిక్ కార్ల వినియోగం రోజు రోజుకు పెరుగుతోంది.. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజు వేలసంఖ్య వాహనాలు అమ్ముడవుతున్నాయి. ఇక ఈ తరుణంలోనే టెస్లా ఎలక్ట్రిక్ కార్ల అధినేత ఎలాన్ మస్క్ కార్ల అమ్మకాల్లో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం 9 లక్షల కార్లను అమ్మగా వచ్చే ఏడాది నాటికి వాటి సంఖ్య 13 లక్షలకు పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారనే నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అమెరికాకు చెందిన ఈ సంస్థ చైనాతో పాటు అనేక దేశాలకు తమ కార్లను ఎగుమతి చేస్తోంది.

Read More : Punjab New CM : పంజాబ్ కొత్త సీఎం సుఖ్‌జిందర్ సింగ్ రణ్‌ధావా

భారత్ లో అమ్మకాలు చేపట్టేందు టెస్లా కంపెనీ ఆసక్తి చూపుతున్నప్పటికి ఇక్కడ ఉన్న సుంకాలతో వెనకడుగు వేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో రెండు దఫాలు చర్చలు జరిపారు. దిగుమతి సుంకం తగ్గించేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక ఈ నేపథ్యంలోనే టెస్లా వెనకడుగు వేస్తోంది. అయితే ఈ ఏడాది చివరి నాటికి తమ కంపెనీలోని నాలుగు వేరియన్ల ఎలక్ట్రిక్ కార్లలో ఒక మోడల్ ను ఇండియాలో లాంచ్ చేస్తామని టెస్లా ప్రతినిధులు తెలిపారు.

అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చిప్ ల సమస్య తీవ్రంగా ఉంది. చాలా కంపెనీలు చిప్ ల కొరతతో ఉత్పత్తి తగ్గించాయి. కానీ టెస్లా మాత్రం అందుకు బిన్నంగా కార్ల ఉత్పత్తుల్ని పెంచుతుందని వెడ్‌ బుష్‌ సెక్యూరిటీ రిపోర్ట్‌ తెలిపింది. లాస్ ఏంజిల్స్ సంస్థ డాన్ ఐవ్స్ విశ్లేషకుడు.. ఈ ఏడాది చివరి నాటికి టెస్లా 9 లక్షల ఎలక్ట్రిక్ వాహనాల్ని డెలివరీ చేస్తుందని, వచ్చే ఏడాది నాటికి 1.3 మిలియన్ వాహనాల్ని అమ్మే సామర్ధ్యం టెస్లాకు ఉందని చెప్పారు. అంతేకాదు ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం పెరుగుతుందని, రాబోయే రోజుల్లో ఎలాన్‌ మస్క్‌ టెస్లా కార్ల అమ్మకాల్లో ప్రథమ స్థానంలో ఉంటారని తెలిపారు.

Read More : Chinnajeeyar Swamy: తమిళనాడు సీఎం స్టాలిన్‌ను కలిసిన చిన జీయర్‌స్వామి

ఇక చైనా మార్కెట్లో టెస్లా కార్లకు భారీ డిమాండ్ ఉంది. ఆగస్టు నెలలో చైనాలో 44,264 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించి టెస్లా. అయితే ఇందులో 31,379 యూనిట్లను ఇతర మార్కెట్లకు ఎగుమతి చేసింది. చైనాలో జులైలో 8,621 యూనిట్లు, ఆగస్టు నెలలో 12,885 యూనిట్లను అమ్మింది. 2025 నాటికి మార్కెట్లోని ఎలక్ట్రిక్ కార్లలో టెస్లా కార్లు 10 ఆక్రమిస్తాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా ప్రస్తుతం, ప్రపంచవ్యాప్తంగా మొత్తం వాహనాలలో 3 శాతం టెస్లా ఎలక్ట్రిక్‌ వాహనాలున్నాయి.