Chinnajeeyar Swamy: తమిళనాడు సీఎం స్టాలిన్‌ను కలిసిన చిన జీయర్‌స్వామి

శంషాబాద్‌ ముచ్చింతల్‌లోని శ్రీరామనగర్‌లో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్‌స్వామి ఆశ్రమంలో ఆవిష్కృతం కానున్న అద్భుత ఘట్టానికి ఆహ్వాన కార్యక్రమాల పరంపర కొనసాగుతోంది.

Chinnajeeyar Swamy: తమిళనాడు సీఎం స్టాలిన్‌ను కలిసిన చిన జీయర్‌స్వామి

Chinna Jeeyar

Chinna Jeeyar Swamy Meets MK Stalin: శంషాబాద్‌ ముచ్చింతల్‌లోని శ్రీరామనగర్‌లో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్‌స్వామి ఆశ్రమంలో ఆవిష్కృతం కానున్న అద్భుత ఘట్టానికి ఆహ్వాన కార్యక్రమాల పరంపర కొనసాగుతోంది. భక్తులను భగవంతుడికి అనుసంధానం చేసిన ఆధ్మాత్మక విప్లవమూర్తి, సమతామూర్తి భగవాద్రామానుజుల సహస్రాబ్ది వేడుకలు వచ్చే ఏడాది(2022) ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్ కు ఆహ్వాన పత్రిక అందజేశారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి.

Mk Stalin (1)

Chinna Jeeyar Swamy meets MK Stalin with Myhome Rameswar Rao

ఈ వేడుకల సమయంలోనే చినజీయర్‌ స్వామి ఆశ్రమంలో అతిపెద్ద సమతామూర్తి విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. 200 ఎకరాల్లో వెయ్యికోట్ల ఖర్చుతో 216 అడుగుల రామానుజ పంచలోహ విగ్రహాన్ని నెలకొల్పుతున్నారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ముఖ్యమైన నేతలను ఆహ్వానిస్తున్నారు.

Mk Stalin (2)

Chinna Jeeyar Swamy meets MK Stalin with Myhome Rameswar Rao

మైహోం గ్రూప్‌ అధినేత జూపల్లి రామేశ్వర్‌రావు, మైహోం డైరెక్టర్లు రంజిత్ రావు, రాము రావుతో కలిసి చినజీయర్‌ స్వామి పలువురు కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు అందజేస్తున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పలువురు కేంద్రమంత్రులతో సహా హోంశాఖ మంత్రి అమిత్‌ షా, ప్రధాని మోడీలను కలిసి ఆహ్వానించారు.

Mk Stalin (3)

Chinna Jeeyar Swamy meets MK Stalin

ఈ క్రమంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్‌ను మై హోం అధినేత రామేశ్వరరావుతో వెళ్లి కలిసిన చిన జీయర్‌స్వామి రామానుజ సహస్రాబ్ది వేడుకలకు రావాలని ఆహ్వానించారు. ముచ్చింతల్‌లో రామానుజ ప్రాజెక్టుపై, భగవత్‌ రామానుజుల జీవిత విశేషాలు, కార్యక్రమ విశిష్టతను ఈ సంధర్భంగా స్టాలిన్‌కు వివరించారు.

Mk Stalin (5)

Chinna Jeeyar Swamy meets MK Stalin with Myhome Rameswar Rao