Elon Musk: వైన్ యాప్ తిరిగిరాబోతుందా? ట్విటర్ టేకోవర్ తరువాత మస్క్ ఆ మేరకు ప్రయత్నాలు ప్రారంభించాడా?

ఎలోన్ మస్క్ అక్టోబర్ 31న ట్విట్టర్‌లో పోల్ నిర్వహించారు.. వినియోగదారులు వైన్‌ను తిరిగి పొందాలనుకుంటున్నారా? అని అడిగారు. ఇందుకు 4.9 మిలియన్ల మంది ఓట్లు వేయగా.. 69.6% మంది వైన్‌ను తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని కోరగా, 30.4% మంది వద్దు అని ఓటు వేశారు.

Elon Musk: వైన్ యాప్ తిరిగిరాబోతుందా? ట్విటర్ టేకోవర్ తరువాత మస్క్ ఆ మేరకు ప్రయత్నాలు ప్రారంభించాడా?

Elon Musk

Elon Musk: ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్నాడు. వెంటనే ప్రక్షాళనసైతం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో సీఈఓ పరాగ్ అగర్వాల్ ను, లీగల్ పాలసీ, ట్రస్ట్, సేఫ్టీ హెడ్ విజయ గద్దెను, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్లతో పాటు తొమ్మిది మంది డైరెక్టర్లను తొలగించారు. మరికొందరి ఉద్యోగులనుసైతం తొలగించేందుకు మస్క్ సిద్ధమయ్యారు. మరోవైపు మస్క్.. షార్ట్ ఫారమ్ వీడియో హోస్టింగ్ సర్వీస్ ‘వైన్’ ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తొంది.

Elon Musk : నేనే రాజు.. నేనే మంత్రి.. ట్విట్టర్ బోర్డు నుంచి డైరెక్టర్లంతా ఔట్.. ఇక ఎలన్ మస్క్ ఒక్కడే.. ఏక్‌ నిరంజన్..!

ఎలోన్ మస్క్ అక్టోబర్ 31న ట్విట్టర్‌లో పోల్ నిర్వహించారు.. వినియోగదారులు వైన్‌ను తిరిగి పొందాలనుకుంటున్నారా? అని అడిగారు. ఇందుకు 4.9 మిలియన్ల ఓట్లు వేయగా.. 69.6% మంది ప్రజలు వైన్‌ను తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని కోరగా, 30.4% మంది వద్దు అని ఓటు వేశారు. యాక్సియెస్ ప్రకారం.. మస్క్ ఇప్పుడు వైన్ ని తిరిగి తీసుకురావాలని ట్వీటర్ ఇంజనీర్లను కోరినట్లు, ఈ ఏడాది చివరి నాటికి యాప్ ను పునరుద్దరించవచ్చునని తెలుస్తోంది.

వైన్ అనేది షార్ట్-ఫారమ్ వీడియో హోస్టింగ్ సర్వీస్. ఇది 2012లో స్థాపించబడింది. తర్వాత దీనిని ట్విటర్ కొనుగోలు చేసింది. టిక్‌టాక్‌కు ముందు ఈ సేవ ప్రారంభించబడింది. ఆరు సెకన్ల నిడివిగల లూపింగ్ వీడియో క్లిప్‌లను షేర్ చేయాలనే ఆలోచనను ప్రజలు ఇష్టపడ్డారు. దీంతో దాని మంచి ఆదరణ లభించింది. అయితే దానిని 2016లో మూసివేశారు. అయితే టిక్ టాక్, ఇన్ స్టాగ్రామ్ వంటి యాప్ లు ఉన్నప్పటికీ ఎలాన్ మస్క్ వైన్ ను మళ్లీ ఎలా పునరుద్దరిస్థారో, ఎలా విజయవంతం చేస్తారో అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.