Elon Musk : నేనే రాజు.. నేనే మంత్రి.. ట్విట్టర్ బోర్డు నుంచి డైరెక్టర్లంతా ఔట్.. ఇక ఎలన్ మస్క్ ఒక్కడే.. ఏక్‌ నిరంజన్..!

Elon Musk : బిలియనీర్ ఎలన్ మస్క్ మామూలోడు కాదు.. ట్విట్టర్ ఇట్టా కొన్నాడో లేదో.. అప్పుడే ట్విట్టర్‌లో వేటు మొదలుపెట్టాడు. చిన్న ఉద్యోగుల నుంచి పెద్ద బాసుల వరకు ఒకరి తర్వాత మరొకరిని తొలగిస్తున్నాడు.

Elon Musk : నేనే రాజు.. నేనే మంత్రి.. ట్విట్టర్ బోర్డు నుంచి డైరెక్టర్లంతా ఔట్.. ఇక ఎలన్ మస్క్ ఒక్కడే.. ఏక్‌ నిరంజన్..!

Elon Musk fires entire Twitter board to become sole director

Elon Musk : బిలియనీర్ ఎలన్ మస్క్ మామూలోడు కాదు.. ట్విట్టర్ ఇట్టా కొన్నాడో లేదో.. అప్పుడే ట్విట్టర్‌లో వేటు మొదలుపెట్టాడు. చిన్న ఉద్యోగుల నుంచి పెద్ద బాసుల వరకు ఒకరి తర్వాత మరొకరిని తొలగిస్తున్నాడు. ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ (Twitter) కొత్త చీఫ్‌గా ఎలన్ మస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈసారి ట్విట్టర్ బోర్డులోని అందరి సభ్యులను మస్క్ తొలగించారు. ఇకపై ట్విట్టర్ బోర్డులో మరో బాస్ ఉండేది లేదని, నేనే రాజు.. నేనే మంత్రి అన్నట్టుగా ఉండాలనేది మస్క్ నిర్ణయంగా కనిపిస్తుంది. ఇప్పటికే సీఈఓ సహా అందరి బాస్‌లపై వేటు వేసిన మస్క్.. వారి స్థానంలో కొత్త బాసులను అపాయింట్ చేసుకుంటున్నారు.

ఇప్పుడు ఏకంగా ట్విట్టర్ బోర్డులోని డైరెక్టర్ల అందరిపై మస్క్ వేటు వేశారు. దాంతో ట్విట్టర్ బోర్డులో మస్క్ మాత్రమే సింగిల్ డైరెక్టర్ గా కొనసాగనున్నారు. నవంబర్ 1వ తేదీకి ముందు ట్విట్టర్ కంపెనీలో భారీ తొలగింపులు జరుగవచ్చు అని నివేదికలను ఖండించిన మస్క్.. కొన్ని గంటల్లోనే ఈ దిశగా సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ట్విట్టర్ కొత్త యజమానిగా మస్క్ మాత్రమే కొనసాగనున్నారు.

Elon Musk fires entire Twitter board to become sole director

Elon Musk fires entire Twitter board to become sole director

ఇకపై ట్విట్టర్ బోర్డులోని మునపటి సభ్యులందరూ డైరెక్టర్లు కారు. తొలగించిన ఉద్యోగులకు స్టాక్ గ్రౌంటులను చెల్లించకుండా ఉండేందుకు ఈ దిశగా మస్క్ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అందుకే నవంబర్ 1 వరకు డెడ్ లైన్ విధించారట.. 44 బిలియన్ డాలర్లకు మాస్క్ ట్విట్టర్ కొనుగోలు చేశాడు. కొన్న వెంటనే ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్, సీఎఫ్ఓ నెడ్ సెగల్, పాలసీ చీఫ్ విజయ్ గద్దెతో సహా అందరికి మస్క్ ఉద్వాసన పలికారు.

మస్క్ ఏమాత్రం సమయాన్ని వృథా చేయకుండా నవంబర్ 7లోగా ట్విట్టర్ మొత్తంలో ప్రక్షాళన జరిగిపోవాలని భావిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఈ మేరకు ఒక బృందాన్ని నియమించినట్టు కూడా తెలిసింది. పోస్టుల నుంచి తప్పించిన అందరికి మస్క్ న్యాయపరంగా వారికి రావాల్సిన సొమ్మును కూడా ముట్టజెబుతున్నారట.. అలాగే ట్విట్టర్ కంపెనీలో స్టాఫ్ కూడా తగ్గించే దిశగా మస్క్ అడుగులు వేస్తున్నారట..

అందిన సమాచారం ప్రకారం.. ట్విట్టర్ సిబ్బందిలో 75 శాతం మందిని తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. అదేగాని జరిగితే.. ట్విట్టర్ కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 7,500 నుంచి 2వేలకు తగ్గుతుందని ఓ నివేదిక తెలిపింది. దీనిపై మస్క్ మాత్రం మొదటినుంచి ఖండిస్తూనే వస్తున్నారు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Instagram Users : ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు వింత అనుభవం.. సడెన్‌గా సస్పెండ్ అయిన ఇన్‌స్టా అకౌంట్లు.. మెటా రెస్పాన్స్ ఇదే..!