Elon Musk-Zuckerberg : బీచ్లో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఎలన్ మస్క్,జుకర్ బర్గ్.. దీనిపై మస్క్ ఏమన్నారంటే..
టెస్లా, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్..మెటా ఢఈవో మార్క్ జుకర్ బర్గ్ బీచ్ లో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న ఫోటోలో వైరల్ అవుతున్నాయి.
Elon Musk-Mark Zuckerberg : ఎలన్ మస్క్(Elon Musk), జుకర్ బర్గ్ (Mark Zuckerberg)..ఇద్దరి మధ్యా పోటీ..ఇటు ట్విట్టర్ (Twitter)…అటు ఫేస్ బుక్ (Face book)..తాజాగా ట్విట్టర్ కు పోటీగా మెటా (Meta) థ్రెడ్స్ (Ehreads) యాప్ ను తీసుకొచ్చింది. ఈ థ్రెడ్స్ దెబ్బకు ట్విట్టర్ విలవిల్లాడిపోయింది. అటువంటి దిగ్జజ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్స్ అయిన ట్విట్టర్ అధినేత మస్క్, మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ (Meta CEO Mark Zuckerberg)మధ్య వ్యాపార పోటీ ఎప్పుడు ఉంటుంది. అటువంటి వీరు ఇద్దరు కలిసిపోయారా? అనేలా ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎలాన్ మస్క్(Elon Musk), జుకర్ బర్గ్ (Mark Zuckerberg)ఇద్దరు కలిసి బీచ్ లో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటో వీరి సాన్నిహిత్యం చూస్తే ఇద్దరు కలిసిపోయారా? అనేలా ఉంది.ఇంతకీ వీరిద్దరు నిజంగానే కలిసిపోయారా..? లేదా టెక్ మాయాజాలమా? అనేది కూడా తెలియనంతగా ఉందీ ఫోటో..
వ్యాపార పోటీల్లో ఎప్పుడు వార్తల్లో నిలిచే వీరిద్దరు ఒకరి చేతిలో మరొరకు చేయి కలుపుకుని బీచ్ లో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న ఫోటో తెగ వైరల్ గా మారింది. దీని వెనుకు ఉన్న అసలు కారణమేంటీ? టెక్ మాయాజాలమా..అంటే నిజమే..వాళ్లిద్దరూ కలిసి ఫొటోలు దిగలేదు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మాయ ఇదంతా.. ఓ ట్విటర్ యూజర్.. వాళ్లిద్దరూ కలిసి దిగినట్టుగా ఫొటోలు క్రియేట్ చేసి అదే సోషల్ మీడియోలో పోస్ట్ చేయటంతో వీరి ఫోటోలు రచ్చ రచ్చ చేస్తున్నాయి. ఈ మోస్ట్ సెన్సేషనల్ పర్సన్స్ ఫొటోలకు ఇంగ్లిష్లో ‘గుడ్ ఎండింగ్’ అనే క్యాప్షన్ జోడించి ట్విటర్లో షేర్ చేశారు. ఆ ఫొటోల్లో మస్క్, జుకర్బర్గ్ ఇద్దరూ బీచ్లో ఓ జంట ఫోటోషూట్లో పాల్గొన్నట్లుగా ఉన్నారు.
Elon Musk-Bernard Arnault Lunch Meet : ఫ్యామిలీలతో పారిస్లో మీట్ అయిన ప్రపంచ కుబేరులు
వీరిద్దరు బీచ్లో నడుస్తున్నట్టుగా, ఒకరిని ఒకరు కౌగిలించుకున్నట్లుగా..ఇద్దరూ కలిసి బీచ్లో పరుగులు తీస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లుగా క్రియేట్ చేయటం ఓ ఎత్తు అయితే..వరల్ట్ ఫేమస్ పర్సన్స్ అయిన వీరిద్దరు కలిశారు అనే వార్తే పెద్ద సెస్సేషన్ అని చెప్పాల్సిందే. ఈ ఫోటోలను ట్విటర్లో షేర్ చేసిన కొద్దిసేపటికే 70 లక్షల మంది చూడటం మరో లక్ష మందికి పైగా లైక్ కొట్టటం అంతా జరిగిపోయాయి. ఈ ఫొటోలు వైరల్ కావడంతో మస్క్ మామ కూడా స్పందిస్తు..స్మైలింగ్ ఎమోజీతో రిప్లై ఇచ్చారు.
The good ending ❤️ pic.twitter.com/smQjNTzc45
— Sir Doge of the Coin ⚔️ (@dogeofficialceo) July 14, 2023
ఇక ఈ ఫొటోలపై నెటిజన్లు భారీ స్థాయిలో కామెంట్స్ తో అంతకంటే రచ్చ చేస్తున్నారు. చేస్తున్నారు. ‘వాస్తవానికి వాళ్లు మీమ్స్ కోసం ఇలా కలిసి ఫోటోషూట్ చేయాలి’ అని ఒకరు అంటుంటే..‘వావ్ కపుల్ గోల్స్’ అని మరొకరు. ‘మస్క్ ఈ రోజు మెటాను కొనుగోలు చేశారా ఏంటీ?’ అంటూ ఇంకొరు. ఇలా వారి వారి కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు సోషల్ మీడియా దిగ్గజాలను అదే సోషల్ మీడియాలో..
Elon Musk Viral Pics : భారతీయ వరుడు వస్త్రధారణతో ఎలన్ మస్క్..!
కాగా కొన్ని రోజుల క్రితం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఎలాన్ మస్క్ భారతీయ సంప్రదాయ దుస్తులతో ఎలాన్ మస్క్ ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో తెలిసిందే. అలా 21 ఏళ్లలో శ్రీరాముడు ఎలా ఉంటాడో అనే ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. దటీజ్ టెక్నాలజీ మాయాజాలం..ఎవరు ఎవరితో అయినా సరే ఉన్నారనేలా టెక్నాలజీ మారిపోయింది.