NASA Dart Mission : అదిగో ఆస్టరాయిడ్ దూసుకొస్తోంది.. ‘డైనోసార్ల ప్రతీకారం తీర్చుకోండి’ ఎలన్ మస్క్‌ ట్వీట్!

అదిగో అతిపెద్ద ఆస్టరాయిడ్.. మన భూగ్రహంపైకి దూసుకొస్తోంది. ఏ క్షణమైనా భూమిని ఢీకొట్టవచ్చు. అది మన భూమిని ఢీకొట్టే ముందే దాన్ని నాసా అంతరిక్ష నౌక ఢీకొట్టబోతోంది.

NASA Dart Mission : అదిగో ఆస్టరాయిడ్ దూసుకొస్తోంది.. ‘డైనోసార్ల ప్రతీకారం తీర్చుకోండి’ ఎలన్ మస్క్‌ ట్వీట్!

Elon Musk Wants To 'avenge The Dinosaurs' With Asteroid Destroying Nasa Mission

NASA Dart Mission : అదిగో అతిపెద్ద ఆస్టరాయిడ్.. మన భూగ్రహంపైకి దూసుకొస్తోంది. ఏ క్షణమైనా భూమిని ఢీకొట్టే ప్రమాదం లేకపోలేదు. అందుకే.. అది మన భూమిని ఢీకొట్టే ముందే దాన్ని నాసా అంతరిక్ష నౌక ఢీకొట్టబోతోంది నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ National Aeronautics and Space Administration (NASA). ఇందుకోసం నాసా ప్రతిష్టాత్మకంగా డార్ట్ మిషన్ (Double Asteroid Redirection Test (Dart) mission చేపడుతోంది. ఈ మిషన్‌కు స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ మద్దతు పలుకుతూ ఆసక్తికర ట్వీట్ చేశాడు.

అప్పటి డైనోసర్లను పొట్టనపెట్టుకున్న ఈ ఆస్ట్రరాయిడ్లపై మనం ప్రతీకారం తీర్చుకుందాం అంటూ ట్వీట్ చేశాడు ఈ అపరకుబేరుడు.. స్పేస్‌ఎక్స్‌ కోసం అమెరికా స్పేస్‌ ఏజెన్సీ నాసాతో మస్క్ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే నాసా డార్ట్‌ మిషన్‌పై మస్క్ తాజాగా స్పందించాడు. భూగ్రహం వైపు దూసుకొచ్చే అతిపెద్ద ఆస్టరాయిడ్‌‌ను స్పేస్‌క్రాఫ్ట్‌తో ఢీకొట్టించడమే నాసా ప్రయత్నం. ఆ ప్రయత్నానికి మస్క్ ఫుల్ సపోర్ట్ అంటున్నాడు. భారత కాలమాన ప్రకారం.. ఎలన్‌ మస్క్‌ Elon musk సంస్థకు చెందిన Space X ఫాల్కన్‌9 రాకెట్‌ ద్వారా స్పేస్‌క్రాఫ్ట్‌ను నాసా అంతరిక్షంలోకి పంపింది. దీనిపై మస్క్‌ తనదైన శైలిలో ఇలా ట్వీట్ చేశాడు. ‘డైనోసార్ల ప్రతీకారం తీర్చుకోండి’ అంటూ నాసా ట్వీట్‌ ను రీట్వీట్ చేశాడు ఎలన్‌ మస్క్‌. బిలియన్ల ఏళ్ల క్రితం మెసోజోయిక్‌ Mesozoic Era యుగంలో ఆస్టరాయిడ్ భూమిని ఢీకొట్టాయి.


ఆనాటి ఆస్ట్రరాయిడ్ల ప్రభావానికి డైనోసార్లు అంతరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అలాంటి ఆస్టరాయిడ్‌లే భూమికి అతి దగ్గరగా రాబోతున్నాయి. మరో వినాశనం సంభవించకుండా ఉండేందుకు నాసా ముందుగానే ఆ ఆస్ట్రరాయిడ్ పేల్చేయనుంది. అందుకే డైనోసార్ల ప్రతీకారం తీర్చుకోండనే ఉద్దేశంతో మస్క్‌ ఇలా ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు మస్క్‌ ఫాలోవర్ల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. నాసా చేపట్టిన ఈ డార్ట్‌ మిషన్ పూర్తి కావడానికి ఏడాది సమయం పట్టొచ్చు. అంతకంటే ఎక్కువ టైం పట్టొచ్చునని నాసా అంచనా వేస్తోంది. నాసా ప్లాన్ ప్రకారం.. అతిపెద్ద ఆస్టరాయిడ్‌ నాశనమైతే.. భూమికి రాబోయే ముప్పు తప్పినట్టే.. అంతేకాదు… రాబోయే రోజుల్లో అంతరిక్షంలో నుంచి భూమిపైకి దూసుకొచ్చే ఇలాంటి ఆస్టరాయిడ్‌లను, ఉల్కలను డార్ట్‌ మిషన్ ద్వారా వాటి దారి మళ్లించడమో, నాశనం చేయడానికి ఇదే ఆరంభమని చెప్పవచ్చు.

Read Also :RRR Movie : సోల్ ఆంథమ్ ‘జనని’ వచ్చేసింది..