Elon Musk : కోతి మెదడులో చిప్, అచ్చం మనిషిలాగే పనిచేస్తుందంట..త్వరలోనే మనుషులపై ప్రయోగం

కోతి మెదడులో చిప్ చేర్చడం ద్వారా..అచ్చం మనిషిలాగే పనిచేస్తుందంటున్నారు ఎలన్ మస్క్. కోతి వీడియో గేమ ఆడుతుంటే..దానిని వీడియో తీసి..యూ ట్యూబ్ లో పోస్టు చేయడంతో తెగ వైరల్ అయ్యింది.

Elon Musk : కోతి మెదడులో చిప్, అచ్చం మనిషిలాగే పనిచేస్తుందంట..త్వరలోనే మనుషులపై ప్రయోగం

Monkey

Brain Chip Company: కోతి మెదడులో చిప్ చేర్చడం ద్వారా..అచ్చం మనిషిలాగే పనిచేస్తుందంటున్నారు ఎలన్ మస్క్. కోతి వీడియో గేమ ఆడుతుంటే..దానిని వీడియో తీసి..యూ ట్యూబ్ లో పోస్టు చేయడంతో తెగ వైరల్ అయ్యింది. అందులో కోతి ఓ దానిపై ఎక్కి..అచ్చం మనిషిలాగే..గేమ్ ఆడుతూ కనిపించింది. కొద్దిసేపు ఆడిన తర్వాత…ఓ అరటిపండును ఎంచక్కా..తొక్క తీసుకుంటూ..తినేయడం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది.

చాలా అంశాల్లో తనదైన మార్క్ చూపిస్తున్నారు టెస్లా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్. 2016లో న్యూరాలింక్ (Neuralink) అనే బ్రెయిన్ చిప్ స్టార్టప్ ప్రారంభించారు. దీని ఫలితాలు మెల్లిగా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. ఈ కంపెనీ ఆవిష్కరించిన పాంగ్ (Pong) గేమ్ చిప్ ని మకాక్ (Macaque) జాతికి చెందిన పాజెర్ (Pager)మెదడులో అమర్చారు. గేమ్ ని అచ్చం మనుషుల్లాగా ఆడగలుగుతోంది. సాధారణంగా..కోతులు భయపడి అమాంతం దూరం వెళుతున్నాయి. కానీ..ఈ కోతిలో చిప్ అమర్చడం మూలంగా..జాయ్ స్టిక్ ఎలా కదుపుతూ…గేమ్ నెగ్గుతామో..చిప్ ద్వారా తెలుసుకుని అలాగే చేస్తోంది. ఈ కోతి చాలా గేమ్స్ ఆడుతూ…ఎంజాయ్ చేస్తోంది. ఎవరైనా పక్షవాతం వస్తే..అలాంటి వారు ఈ చిప్ ద్వారా..మాములు మనుషుల కంటే..వేగంగా స్మార్ట్ ఫోన్ వాడే సదుపాయం కల్పించగలమంటున్నాడు ఎలన్ మస్క్.

డైమెన్షియా, అల్జీమర్స్ వంటి సమస్యలున్న వారికి నాడీ సంబంధిత సమస్యల నుంచి కాపాడేందుకు న్యూట్రాలింక్ కంపెనీ బ్రెయిన్ చిప్ లు తయారు చేపడుతున్నారు. అందులో భాగంగానే..కోతిపై ప్రయోగాలు చేస్తున్నారు. ఈ ప్రయోగాలు సక్సెస్ అయితే..మనుషులపై ప్రయోగిస్తారు. అయితే..ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది మెచ్చుకోగా..మరికొందరు జంతువులను హింసించినట్లే అంటూ వెల్లడిస్తున్నారు. కోతిని మాములుగానే వదిలిస్తే…ఇంతకంటే ఆనందంగా ఆడుతుందని మరొకరు కామెంట్ చేశారు.


Read More : Drunken Drive Cases : తాగినోళ్లను సేఫ్ గా ఇంటికి తీసుకెళ్లండి బార్ యజమానులకు సీపీ సూచన