Drunken Drive Cases : తాగినోళ్లను సేఫ్ గా ఇంటికి తీసుకెళ్లండి బార్ యజమానులకు సీపీ సూచన

ఫుల్ గా మందు సేవించిన వాళ్లను సేఫ్ గా ఇంటికి తీసుకెళ్లే ఏర్పాట్లు చేయాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ నిర్వాహకులకు సూచించారు.

Drunken Drive Cases : తాగినోళ్లను సేఫ్ గా ఇంటికి తీసుకెళ్లండి బార్ యజమానులకు సీపీ సూచన

Cp Sajjanar

Drunken drive cases : ఫుల్ గా మందు సేవించిన వాళ్లను సేఫ్ గా ఇంటికి తీసుకెళ్లే ఏర్పాట్లు చేయాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ నిర్వాహకులకు సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వారికి గుర్తుకు చేశారు. దీనిని తగ్గించాలంటే…డ్రైవర్ లను ఏర్పాటు చేసి వారిని క్షేమంగా ఇంటికి తీసుకెళ్లే విధంగా చూడడం బాధ్యతగా తీసుకోవాలన్నారు. రెస్టారెంట్లు, పబ్ లు, స్టార్ హోటళ్లు, వైన్స్ నిర్వాకులతో సైబరాబాద్ సీపీ సజ్జనార్ సమావేశం నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ వల్ల చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు, మరణాలను ఆపేందుకు ఈ సమన్వయ సమావేశం నిర్వహించారు.

పబ్‌లు, బార్లు, హోటళ్లలో మద్యం తాగినవారిని వాహనాలు నడపకుండా చూడాలని, డ్రైవర్లను ఏర్పాటు చేసి వారిని ఇంటికి తీసుకెళ్లే విధంగా చేయాలన్నారు. ఎవరైనా మాట వినకపోతే..వెంటనే 100 డయల్ చేయాలన్నారు. సీసీ కెమెరాలు తప్పకుండా ఏర్పాటు చేయాలని, ప్రధానంగా..పార్కింగ్ వద్ద ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ఎంట్రీ, ఎగ్జిట్ వద్ద బోర్డులు పెట్టి మద్యం సేవించి వాహనం నడపడం నేరమని అవగాహన కల్పించాలని సీపీ సజ్జనార్ సూచించారు.

Read More : 73 Year Old Woman : ”వరుడు కావలెను” అంటూ ప్రకటన ఇచ్చిన ఆ 73ఏళ్ల బామ్మకు పెళ్లి సంబంధం వచ్చింది.. తాత వయసు ఎంతంటే..