European Union: గూగుల్, ఫేస్ బుక్ మెడలు వంచుతాం: దిగ్గజ సంస్థలపై చర్యలకు చట్టం తెచ్చిన ఐరోపా సమాఖ్య

ఆన్ లైన్ సమాచార నియంత్రణ కోసం ప్రతిపాదించిన "డిజిటల్ సేవల చట్టం (డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ DSA)" తీసుకురావాలని సమాఖ్యలోని 27 దేశాలు నిర్ణయించాయి.

European Union: గూగుల్, ఫేస్ బుక్ మెడలు వంచుతాం: దిగ్గజ సంస్థలపై చర్యలకు చట్టం తెచ్చిన ఐరోపా సమాఖ్య

Eu

European Union: ఆన్ లైన్, సోషల్ మీడియా వేదికలపై రెచ్చగొట్టే, అభ్యంతరకర కంటెంట్ ను నియంత్రించే విధంగా టెక్ సంస్థలపై కఠిన ఆంక్షలు విధించేందుకు యురోపియన్ యూనియన్ (ఐరోపా సమాఖ్య) ఓ సరికొత్త చట్టాన్ని తెచ్చింది. ఆన్ లైన్ సమాచార నియంత్రణ కోసం ప్రతిపాదించిన “డిజిటల్ సేవల చట్టం (డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ DSA)” తీసుకురావాలని సమాఖ్యలోని 27 దేశాలు నిర్ణయించాయి. ఈమేరకు యూరోపియన్ పార్లమెంట్ మరియు EU సభ్య దేశాలు డిజిటల్ సేవల చట్టంపై శనివారం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. యూరోపియన్ కమీషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ఈ ఒప్పందాన్ని “చారిత్రాత్మకంగా” అభివర్ణించారు. EUలోని అన్ని ఆన్‌లైన్ సేవల కోసం DSA చట్టం పరిధిలో అన్ని నిబంధనలను పెంపొందింస్తున్నట్లు ఆమె చెప్పారు.

Also read: Pornography Class : యూఎస్‌లో పోర్నోగ్రఫీపై కోర్సు ప్రకటించిన కాలేజ్

“ఆన్‌లైన్ వేదికలను సురక్షితంగా ఉండేలా, భావ ప్రకటనా స్వేచ్ఛను మరియు డిజిటల్ వ్యాపారాల అవకాశాలను ఈ చట్టం కాపాడుతుందని వారు వివరించారు. ఆన్ లైన్ వేదికగా విద్వేషాన్ని పెంచే వ్యాసాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, తప్పుడు సమాచారం, హానికరమైన ప్రసంగాల వ్యాప్తిని అరికట్టేందుకు ఈ చట్టం ఆయా సంస్థలపై స్వీయ నియంత్రణ విధిస్తుందని యూరోపియన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మార్గరెట్ వెస్టేజర్ పేర్కొన్నారు. ముఖ్యంగా గూగుల్, మెటా(గతంలో ఫేస్ బుక్) వంటి సంస్థలపై ఈ చట్టాన్ని ప్రయోగించడం వలన ఆయా సంస్థలపై కఠిన నియంత్రణ విధించడంతో పాటు, ఆయా వేదికలపై చట్టవిరుద్ధమైన మరియు హానికరమైన కంటెంట్‌ను తొలగించేలా ఈ చట్టం ఉపకరిస్తుంది.

Also read:Tourist Boat Missing: జపాన్‌లో పడవ మునిగి 26 మంది పర్యటకులు గల్లంతు!

అదే సమయంలో ఈయూ పరిధిలో గూగుల్, మెటా వేదికలపై వచ్చే అభ్యంతరకర, ఆన్ లైన్ సమాచారంపై వినియోగదారులు ఫిర్యాదు చేసి పరిష్కారం పొందేందుకు కూడా చట్టం ఉపకరిస్తుంది. యూరోపియన్ పార్లమెంట్ మరియు ఈయూ సభ్య దేశాలు ఆమోదం పొందిన వెంటనే ఈ చట్టం అమల్లోకి రానుంది. ఈ చట్టం ప్రకారం ఈయూ పరిధిలో నిబంధనలు అతిక్రమించే టెక్ సంస్థలు, ఆన్ లైన్ వేదికలకు వందల కోట్ల యూరోల జరిమానా విధించనున్నారు. అయితే ఈ జరిమానా ఆయా సంస్థల “అంతర్జాతీయ టర్నోవర్”పై 6 శాతంగా ఉండడం గమనార్హం. ఇక అదేపనిగా ఉల్లంఘనలకు పాల్పడే ఆన్ లైన్ వేదికలను యూరోప్ నుంచి పూర్తిగా నిషేధించేందుకు కూడా ఈ DSA చట్టం వీలు కల్పించనుంది. కాగా, యూరోపియన్ దేశాలు తీసుకురానున్న ఈ DSA చట్టాన్ని తాము స్వాగతిస్తున్నట్లు గూగుల్ సంస్థ ప్రకటించడం విశేషం.

Also Read:Narendra Modi: పెరుగుతున్నకరోనా.. సీఎంలతో మోదీ మీటింగ్