Tourist Boat Missing: జపాన్‌లో పడవ మునిగి 26 మంది పర్యటకులు గల్లంతు!

జపాన్‌లో ఓ పర్యాటకుల పడవ మునిగిపోయింది. అందులో ఉన్న 26 మంది టూరిస్టులు గల్లంతయ్యారు. దాదాపు 7 గంటలపాటు గాలింపు చేపట్టినా ఒక్కరి అచూకీ కూడా లభించలేదు. వీరంతా మరణించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.

Tourist Boat Missing: జపాన్‌లో పడవ మునిగి 26 మంది పర్యటకులు గల్లంతు!

Tourist Boat Missing

Tourist Boat Missing: జపాన్‌లో ఓ పర్యాటకుల పడవ మునిగిపోయింది. అందులో ఉన్న 26 మంది టూరిస్టులు గల్లంతయ్యారు. దాదాపు 7 గంటలపాటు గాలింపు చేపట్టినా ఒక్కరి అచూకీ కూడా లభించలేదు. వీరంతా మరణించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. హక్కైడో ఉత్తర ద్వీపంలో షెరిటొకో ద్వీపకల్పం వద్ద శనివారం మధ్యాహ్నం పెద్ద ఎత్తున గాలులు వీయడంతో ఈ పడవ మునిగిపోయి ఉంటుందని భావిస్తున్నారు. అలలు భారీగా ఎగిసిపడటంతోనే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని తెలిపారు.

Suspected Boat : శ్రీలంక నుంచి నెల్లూరుకు కొట్టుకొచ్చిన పడవలో దేవుళ్ల విగ్రహాలు..చూడటానికి తరలివచ్చిన ప్రజలు

జపాన్‌లోని ఉత్తర తీరప్రాంతం షెరిటికో ద్వీపకల్పం వద్ద 26 మంది పర్యాటకులతో వెళ్లిన కాజు-1 బోటు గల్లంతైనట్లు జపాన్‌ కోస్ట్‌ గార్డ్‌ ప్రకటించింది. జపాన్‌ కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 1.15గంటల ప్రాంతంలో ఈ బోటు సంబంధాలు కోల్పోయినట్లు కోస్ట్ గార్డ్ వెల్లడించింది. బోటు ఆచూకీ కోసం నాలుగు హెలికాప్టర్లతో పాటు ఆరు పెట్రోలింగ్‌ బోట్‌లతో గాలిస్తున్నా ఫలితం లేకపోయింది. బోటులోని 26 మందిలో ఇద్దరు సిబ్బంది కాగా మిగతా వారంతా టూరిస్టులు. వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్టు సమాచారం.

Boat Capsizes : నదిలో పడవ బోల్తా..10మంది గల్లంతు

ఇప్పటివరకు ఏ ఒక్కరి ఆచూకీ తెలియకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రతికూల వాతావరణం నెలకొనడంతో మత్స్యకార పడవలు కూడా వెను తిరిగి వచ్చేయగా.. కాజు-1 మాత్రం సంబంధాలను కోల్పోయింది. మరోవైపు లెబెనన్​లో కూడా ఓ బోటు ప్రమాదానికి గురైంది. వలసదారులు ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడిన ఈ ప్రమాదంలో 60 మంది ప్రయాణికులు ఉండగా.. సహాయక చర్యల్లో 45 మందిని కాపాడారు. మిగతా వారు ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందని అక్కడి మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి.