China: చైనాలో పందుల కోసం ప్యాలెస్.. 26 అంతస్థులతో బిల్డింగ్ నిర్మాణం.. రోగాలు వ్యాపిస్తాయంటున్న నిపుణులు

పందుల పెంపకం కోసం చైనా భారీ నిర్మాణం చేపట్టబోతుంది. పందుల కోసం ప్రపంచంలోనే పెద్దదైన బిల్డింగ్ నిర్మిస్తోంది. ఇదో ‘పిగ్ ప్యాలెస్’. దీనిలో ఏకంగా 26 అంతస్థులు ఉంటాయి.

China: చైనాలో పందుల కోసం ప్యాలెస్.. 26 అంతస్థులతో బిల్డింగ్ నిర్మాణం.. రోగాలు వ్యాపిస్తాయంటున్న నిపుణులు

fjhhjj

China: ఒక పక్క ఇప్పటికీ కోవిడ్‌తో సతమతమవుతున్నప్పటికీ చైనా వైఖరిలో మార్పు రావడం లేదు. గబ్బిలాలతోపాటు, ఇతర జంతువుల ద్వారా అంటు వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నా మూగజీవాల విషయంలో చైనా తన పంథా మార్చుకోవడం లేదు. తాజాగా పందుల కోసం ప్రత్యేకంగా ఒక ప్యాలెస్ నిర్మించాలనుకుంటోంది చైనా.

Tamil Nadu: పాముకు పూజలు చేస్తుండగా నాలుకపై కాటేసిన పాము.. భక్తుడి నాలుక కోసేసిన పూజారి

ఇందు కోసం ఏకంగా 26 అంతస్థులతో భారీ బిల్డింగ్ నిర్మించబోతుంది. అయితే, ఈ నిర్ణయం వల్ల వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనాలోని సెంట్రల్ హుబెయ్ ప్రావిన్స్ పరిధిలోని ఎజో నగర సరిహద్దులో ‘పిగ్ ప్యాలెస్’ పేరుతో ఒక పెద్ద బిల్డింగ్ నిర్మించనుంది. ఇది 26 అంతస్థులు కలిగి ఉంటుంది. పందుల కోసం నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద బిల్డింగ్ ఇదే. ఈ బిల్డింగ్‌లో 6,50,000 పందుల్ని పెంచే వీలుంది. అలాగే ఇక్కడ సంవత్సరానికి మిలియన్ పందుల్ని చంపేందుకు ఏర్పాట్లు చేస్తారు. దీని ద్వారా ఒకేసారి లక్ష టన్నుల మాంసాన్ని ఉత్పత్తి చేస్తారు. ఇక్కడ పందులకోసం అన్ని ఏర్పాట్లు చేస్తారు. అంటే వాటికి అనుకూలమైన వెంటిలేషన్, టెంపరేచర్ వంటివి ఉండేలా చూస్తారు.

Pangeos: సముద్రంలో తేలియాడే మహా నగరం నిర్మిస్తున్న సౌదీ అరేబియా… 65 వేల కోట్లతో సిద్ధంకానున్న భారీ నౌక!

అలాగే వాటికి ఆహారం అందించేందుకు 30,000 ఫీడింగ్ స్పాట్స్ ఏర్పాటు చేస్తారు. పందుల నుంచి వచ్చే వ్యర్థాల్ని బయో గ్యాస్‌గా మారుస్తారు. అయితే, ఇలా భారీ స్థాయిలో పందుల పెంపకం వల్ల అంటువ్యాధులు ప్రబలుతాయని నిపుణులు అంటున్నారు. అయినా వీటిని చైనా ప్రభుత్వం లెక్కచేయడం లేదు. ఇది అంత ప్రమాదకరం కాదని.. పర్యావరణ హితంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం చెబుతోంది.