Pangeos: సముద్రంలో తేలియాడే మహా నగరం నిర్మిస్తున్న సౌదీ అరేబియా… 65 వేల కోట్లతో సిద్ధంకానున్న భారీ నౌక!

సముద్రంలో తేలియాడే మహా నగరాన్ని నిర్మించేందుకు సౌదీ అరేబియా సిద్ధమవుతోంది. అలాగని ఇది సిటీ మాత్రమే కాదు.. ఒక భారీ నౌక కూడా. ప్రపంచంలోనే అతిపెద్ద నౌకను ‘పాంజియోస్’ పేరుతో నిర్మించబోతుంది.

Pangeos: సముద్రంలో తేలియాడే మహా నగరం నిర్మిస్తున్న సౌదీ అరేబియా… 65 వేల కోట్లతో సిద్ధంకానున్న భారీ నౌక!

Pangeos: అత్యంత సంపన్న దేశాల్లో సౌదీ అరేబియా ఒకటి. ప్రపంచమంతా ప్రస్తుతం ఆర్థిక మాంద్యం వైపు పయనిస్తూ ఇబ్బందులు పడుతుంటే.. సౌదీ మాత్రం అనేక ప్రాజెక్టులు చేపడుతూ దూసుకెళ్తోంది. అరబ్ దేశాలపై ఆర్థిక మాంద్యం ప్రభావం చాలా తక్కువ. అందుకే ఈ దేశాలు ప్రపంచంతో సంబంధం లేకుండా గొప్ప ప్రాజెక్టుల్ని నిర్మిస్తున్నాయి. దుబాయ్.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బుర్జ్ ఖలీఫా నిర్మించగా.. ఇప్పుడు సౌదీ అరేబియా మరో అద్భుతానికి శ్రీకారం చుట్టబోతుంది. అదే ‘పాన్‌జియోస్’. ఇదో భారీ నౌక. పాన్‌జియోస్ పేరుతో ప్రపంచంలోనే అతిపెద్దదైన నౌకను సౌదీ నిర్మిస్తోంది. అయితే, సముద్రంలో నిర్మిస్తున్న దీన్ని నౌక అనడంకన్నా.. మహా నగరం అంటే బాగుంటుంది. అది కూడా నీటిపై తేలియాడే ఆధునిక నగరంగా చెప్పొచ్చు. ఇటలీకి చెందిన లజ్జారినీ డిజైన్ స్టూడియోస్ సంస్థ దీన్ని నిర్మిస్తోంది. ఇంతకీ ‘పాన్‌జియోస్’ నిర్మాణానికి అవుతున్న ఖర్చెంతో తెలుసా? మన కరెన్సీలో దాదాపు రూ.65 వేల కోట్లపైమాటే.

Tamil Nadu: పాముకు పూజలు చేస్తుండగా నాలుకపై కాటేసిన పాము.. భక్తుడి నాలుక కోసేసిన పూజారి
దీని ప్రత్యేకత ఏంటంటే..
‘పాన్‌జియోస్’ 1800 అడుగుల పొడవు, 2వేల అడగుల వెడల్పు ఉంటుంది. చూడటానికి ఇది ఒక తాబేలులాగా కనిపిస్తుంది. ఈ నౌకలాంటి నగరంలో హోటల్స్, షాపింగ్ మాల్స్, పార్కులు వంటివి ఉంటాయి. నౌక పై భాగంలో విమానాల్ని ల్యాండ్ చేయొచ్చు. వేరే నౌకలతో ఈ నౌకను అనుసంధానం చేసేలా మధ్యలో పోర్టులాంటి నిర్మాణం కూడా ఉంటుంది. ఈ నౌకలో దాదాపు 60 వేల మంది నివసించే వీలుంది. దీని రెక్కల వంటి భాగంలో 19 ప్రైవేటు విల్లాలు, 64 అపార్టుమెంట్లు ఉంటాయి. వీటన్నింట్లో అన్ని ఆధునిక సౌకర్యాలు ఉంటాయి. తాబేలులాంటి నిర్మాణం ఉన్న ఈ నౌకలో రెక్కలు కదలకుండా ఉంటాయి. ఈ నౌక తక్కువ బరువు కలిగి ఉంటుంది. ఎక్కువ శక్తితో పని చేసే 9 హెచ్‌టీఎస్ ఇంజిన్లు దీనిలో ఉంటాయి. ప్రతి ఇంజిన్లో 16,800 హార్స్ పవర్ ఉన్న మోటార్లు ఉండి నౌకను నడిపిస్తాయి. ఈ నౌక మొత్తానికి కావాల్సిన విద్యుత్‌ను దీనిలోనే ఉత్పత్తి చేస్తారు. ఈ నౌక గంటకు 5 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. నౌక పైభాగం నుంచి సోలార్ ప్యానెళ్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. అలాగే సముద్రంలో ప్రయాణించేటప్పుడు అలల నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.

Viral Video: బైకుపై పారిపోతున్న దొంగను పట్టుకునేందుకు కానిస్టేబుల్ సాహసం… వైరల్ అవుతున్న వీడియో
ఎప్పటికి పూర్తవుతుంది?
ప్రస్తుతం ఈ నౌక నిర్మాణం ప్రారంభ దశలోనే ఉంది. దీనికి సంబంధించిన డిజైన్ మాత్రమే రూపొందింది. దీనిపై ఇప్పటికే నిర్మాణ సంస్థకు, సౌదీ అరేబియాకు మధ్య ఒప్పందం కుదిరింది. వచ్చే ఏడాది నిర్మాణం ప్రారంభం కావొచ్చు. కానీ, దీని నిర్మాణం పూర్తవడానికి కనీసం 20 ఏళ్లు పడుతుందని అంచనా. జెడ్డా నుంచి 81 మైళ్ల దూరంలో ఉన్న కింగ్ అబ్దుల్లా పోర్టులోనే ఈ నౌకను నిర్మిస్తారు. దీని నిర్మాణానికి క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సేకరిస్తారు. నౌకలో నిర్మించబోయే ఆస్తులను ముందుగానే ఎవరైనా కొనుక్కోవచ్చు.