Extremists attack beachside hotel: సోమాలియాలోని బీచ్‌సైడ్ హోటల్‌పై ఉగ్రవాదుల దాడి
సోమాలియా దేశంలోని బీచ్‌సైడ్ హోటల్‌పై శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు దాడి చేశారు.తుపాకీ కాల్పుల శబ్దాలు, పేలుళ్లతో సోమాలియా రాజధానిలోని బీచ్‌సైడ్ హోటల్ ప్రాంతం దద్దరిల్లింది....

Extremists attack
Extremists attack beachside hotel:సోమాలియా దేశంలోని బీచ్‌సైడ్ హోటల్‌పై శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు దాడి చేశారు.తుపాకీ కాల్పుల శబ్దాలు, పేలుళ్లతో సోమాలియా రాజధానిలోని బీచ్‌సైడ్ హోటల్ ప్రాంతం దద్దరిల్లింది.(hotel in Somalia capital) హోటల్ లో చాలామంది పర్యాటకులు చిక్కుకుపోవడంతో వారిని రక్షించేందుకు భద్రతాదళాలు యత్నిస్తున్నాయి. రాజధాని మొగదిషులోని బీచ్‌సైడ్ హోటల్‌పై ఉగ్రవాదులు దాడి చేశారని, ఈ దాడి చేసింది తామేనని అల్-ఖైదా తూర్పు ఆఫ్రికా అనుబంధ సంస్థ అల్-షబాబ్ ప్రకటించింది.
Karnataka College Girl : పోకిరికి కాలేజీ అమ్మాయి గుణపాఠం..అందరిముందు చెప్పుతో కొట్టింది
సోమాలియాకు చెందిన తీవ్రవాద గ్రూపులు మొగడిషులోని హోటళ్లు , ఇతర ఉన్నత స్థానాలపై దాడులకు ప్రసిద్ధి చెందాయి. సాధారణంగా ఆత్మాహుతి బాంబు దాడితో ప్రారంభమవుతుంది.పెరల్ బీచ్ హోటల్ టర్కిష్ ఎంబసీ వీధిలో ఉంది.కాల్పులు జరిగిన సమయంలో తాను రెస్టారెంట్‌లో ఉన్నానని హసన్ అబ్దిరహ్మాన్ చెప్పారు.తాను బీచ్ దిశ నుంచి వచ్చిన తుపాకీ కాల్పుల శబ్దాన్ని విన్నాను అనంతరం తప్పించుకున్నానని చెప్పారు.కాగా సోమాలియాలో అల్-షబాబ్ మిలిటెంట్ల చేతిలో 54 మంది సైనికులు హతమయ్యారని ఉగాండా తెలిపింది.