ఎన్నికలను ప్రభావితం చేస్తున్నాయట.. పేజ్‌లను తొలగించిన ఫేస్‌బుక్

  • Published By: vamsi ,Published On : September 24, 2020 / 07:58 AM IST
ఎన్నికలను ప్రభావితం చేస్తున్నాయట.. పేజ్‌లను తొలగించిన ఫేస్‌బుక్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిరిగి ఎన్నికయ్యే అవకాశాలను దెబ్బతీసేందుకు చైనా కార్యకలాపాలను ప్రారంభించగా ఫేస్‌బుక్ ఆ విషయాన్ని గుర్తించింది. నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలను గుర్తించినట్లు సంస్థ బహిరంగంగా వెల్లడించింది.

చైనా కార్యకలాపాలపై ఆ దేశ ప్రభుత్వానికి ప్రత్యక్షంగా ఆపాదించబడనప్పటికీ , డెమొక్రాటిక్ అభ్యర్థి మాజీ ఉపాధ్యక్షుడు జోసెఫ్ ఆర్. బిడెన్ జూనియర్‌కు మద్దతుగా ఎన్నికలలో చైనా జోక్యం చేసుకుంటుందని ట్రంప్ పదేపదే చేసిన వాదనను తగ్గించే ప్రయత్నం చేస్తుంది ఫేస్‌బుక్.



ట్రంప్ తిరిగి ఎన్నిక అవడాన్ని చైనా వ్యతిరేకిస్తుందని ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేస్తుండగా, ఫేస్‌బుక్‌లో ఇప్పటివరకు చర్యలు చిన్నవిగా ఉన్నాయని, 2016 లో రష్యన్ ప్రయత్నాలతో పోల్చితే పెద్ద ఎత్తున ప్రభావ ఆపరేషన్ చేయాలని బీజింగ్ ఇంకా నిర్ణయించలేదని అధికారులు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే ఫేస్‌బుక్ నకిలీ ఖాతాలు, పేజీలు ఉన్న చైనాకు చెందిన నెట్‌వర్క్‌లను తొలగించింది. అమెరికా సహా ఇతర దేశాల్లోని రాజకీయ కార్యకలాపాలను ఇబ్బందిపరిచేలా ఈ ఖాతాలు ఉన్నాయని ఫేస్‌బుక్‌ స్పష్టం చేసింది. ఆగ్నేయాసియా, ఫిలిప్పీన్స్‌ దేశాల రాజకీయాలపైనే ప్రధానంగా ఈ నెట్‌వర్క్‌ దృష్టి సారించింది.



అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌‌కు వ్యతిరేకంగా, జోసెఫ్ ఆర్. బిడెన్‌కు మద్దతుగా ఈ ఖాతాల్లో పోస్టులు చేసినట్లు చెప్పింది. మరోవైపు విదేశాలకు చెందిన వ్యక్తులు, సైబర్‌ నేరగాళ్లు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసేందుకు, ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని ఎఫ్‌బీఐ సహా హోంలైన్‌ సెక్యూరిటీస్‌ ఇప్పటికే హెచ్చరించాయి.