Amazon Jeff Bezos : అమెజాన్ బాస్‌ను ఏలియన్స్ కిడ్నాప్ చేశారు అంటూ పుకార్లు

అమెజాన్ బాస్‌ జెఫ్‌బెజోన్‌ను ఏలియన్స్ కిడ్పాప్ చేసారంటూ అమెరికాలోని ఒక వర్గం ప్రచారం చేస్తోంది. వీళ్లు ఎదుటి వారి సక్సెస్‌ను జీర్ణించుకోలేరు.

Amazon Jeff Bezos : అమెజాన్ బాస్‌ను ఏలియన్స్ కిడ్నాప్ చేశారు అంటూ పుకార్లు

Jeff Bezos

Amazon Jeff Bezos : అమెజాన్ బాస్‌ జెఫ్‌బెజోన్‌ను ఏలియన్స్ కిడ్పాప్ చేసారంటూ అమెరికాలోని ఒక వర్గం ప్రచారం చేస్తోంది. వీళ్లు ఎదుటి వారి సక్సెస్‌ను జీర్ణించుకోలేరు. ఇలాంటి కుట్ర సిధ్దాంత కర్తలు కొందరు ఈ మధ్య పని గట్టుకుని జెఫ్ బెజోన్ పర్యటనపై వ్యతిరేకంగా ప్రచారం మొదలెట్టారు. వీళ్లు జెఫ్ బెజోన్ పై చేస్తున్న ప్రచారం చూస్తుంటే అబ్బో అనిపిస్తోంది.

జెఫ్ బెజోన్ అంతరిక్షయాత్ర చేసి వచ్చి వారం రోజులు కాలేదు. అప్పుడే ఆయన గురించి తిక్క, తిక్క వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇంతకీ ఆకుట్ర సిధ్దాంత కర్తలు చెప్పేది ఏంటయ్యా అంటే… అంతరిక్షంలోకి వెళ్లిన బెజోస్‌ను ఏలియన్లు కిడ్నాప్ చేశాయట. ఆయన ప్లేస్‌లో ఏలియన్ డబుల్ బాడీని తిరిగి భూమి మీదకు పంపించాయట.

అందుకే ఆయన మెడ ఎలా సాగిలపడిందో చూడండి….. అంటూ ఏవో ఆధారాలు చూపెడుతున్నారు వాళ్లు. అంతేకాదు ఈ కిడ్నాప్‌ ద్వారా భూమ్మీద పట్టుసాధించాలని ఏలియన్లు ప్రయత్నిస్తున్నాయనే తట్టుకోలేని మరో వాదనను సైతం వీళ్లు లేవనెత్తుతున్నారు. ఈవార్తలను అమెజాన్ కొట్టిపారేసింది. పదకొండు నిమిషాల గ్యాప్ లో… అదీ తోడుగా ఇతర సభ్యులు ఉండగా… ఏలియన్స్ కిడ్నాప్ చేశారనే కట్టుకధలను అంతా తోసి పుచ్చుతున్నారు.