Indonesia : ఇండోనేషియాలోని జైలులో అగ్నిప్రమాదం…41 మంది ఖైదీలు సజీవదహనం

ఇండోషేసియాలో ఘోర ప్రమాదం జరిగింది. జకార్తాలోని టాంగెరాంగ్‌ జైలులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 41 మంది ఖైదీలు సజీవదహనం అయ్యారు. మరో 39 మంది ఖైదీలకు తీవ్ర గాయాలయ్యాయి.

Indonesia : ఇండోనేషియాలోని జైలులో అగ్నిప్రమాదం…41 మంది ఖైదీలు సజీవదహనం

Fire Accident

fire breaks in Indonesia : ఇండోనేషియాలోని ఘోర ప్రమాదం జరిగింది. జకార్తాలోని టాంగెరాంగ్‌ జైలులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 41 మంది ఖైదీలు సజీవదహనం అయ్యారు. మరో 39 మంది ఖైదీలకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు జైలు అధికారులు పేర్కొన్నారు. జకార్తా సరిహద్దుల్లో ఉన్న టాంగెరాంగ్‌ జైలు సీ బ్లాక్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఈ బ్లాక్‌లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసుల్లో అరెస్టైన ఖైదీలు ఉంటారు. ఇక్కడ 122 మంది ఉండేందుకు ఏర్పాట్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. బుధవారం తెల్లవారుజామున 1గంట నుంచి మంటలు చెలరేగాయి. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఎంత మంది ఉన్నారనేది తెలియరాలేదు.

ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయకసిబ్బంది ఖైదీలను సురక్షితంగా తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇండోనేషియా జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలను ఉంచడం కొన్ని రోజులుగా పెద్ద సమస్యగా మారింది. 1,225 మంది సామర్థ్యం గల టాంగెరాంగ్‌ జైలులో 2000 మందిని ఉంచారు. మరోవైపు సరిపడా నిధులు కేటాయించడంలో ప్రభుత్వం విఫలమవడంతో జైళ్లలో కనీస వసతులు కరువయ్యాయి.

ఈనేపథ్యంలో కొంతమది ఖైదీలు తప్పించుకోవడానికి ప్రయత్నించడం, ఖైదీల మధ్య గొడవలు జరగడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలోనే పలుమార్లు స్వల్ప స్థాయి అగ్ని ప్రమాదాలు కూడా చేటు చేసుకున్నాయి.