Fire Accident In Russia : వృద్ధాశ్రమంలో అగ్నిప్రమాదం.. 22 మంది మృతి

రష్యాలో విషాద ఘటన చోటుచేసుకుంది. సైబిరియా ప్రాంతం కెమెరోవో నగరంలోని ఓ వృద్ధాశ్రమంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 22 మంది మరణించారు.

Fire Accident In Russia : వృద్ధాశ్రమంలో అగ్నిప్రమాదం.. 22 మంది మృతి

Fire at old age home

Updated On : December 24, 2022 / 7:47 PM IST

Fire Accident In Russia: రష్యాలో విషాద ఘటన చోటుచేసుకుంది. సైబిరియా ప్రాంతం కెమెరోవో నగరంలోని ఓ వృద్ధాశ్రమంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 22 మంది మరణించారు. శుక్రవారం అర్థరాత్రి సమయంలో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది, స్థానిక అధికారులు ఘటన స్థలికి చేరుకొని మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. శనివారం ఉదయం వరకు మంటలు అదుపులోకి వచ్చినట్లు స్థానిక అధికారులు తెలిపారు.

Mancherial Fire Accident : మంచిర్యాల సజీవదహనం కేసులో షాకింగ్ విషయాలు.. వివాహేతర సంబంధమే కారణం?

ఈ వృద్ధాశ్రమానికి అనుమతులు లేవని అగ్ని ప్రమాదంపై విచారణ చేపట్టిన అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో అందరూ నిద్రపోతున్నారని, దీంతో మృతుల సంఖ్య భారీగా ఉందని తెలిపారు. ఈ వృద్ధాశ్రమం కొనసాగుతున్న భవనంలోని రెండు అంతస్తులు అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్దమయ్యాయి.

Fire Accident In China: చైనాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. 10మంది మృతి.. జీరో కోవిడ్ ఆంక్షలే కారణమా?

ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆశ్రమంలో 28మంది వరకు ఉన్నారు. వీరిలో 22 మంది మరణించగా, మరో ఆరుగురికి గాయాలైనట్లు స్థానిక అధికారులు తెలిపారు. గాయపడ్డ వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. విచారణలో భాగంగా.. ఇంట్లో వెచ్చదనం కోసం ఏర్పాటు చేసిన హీటింగ్ స్టవ్ వల్ల ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాల కోసం విచారణ కొనసాగుతుందని స్థానిక అధికారులు తెలిపారు.