Fire Accident In China: చైనాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. 10మంది మృతి.. జీరో కోవిడ్ ఆంక్షలే కారణమా?

గత 109రోజులుగా జిన్‌జియాంగ్ ప్రావిన్స్ రాజధాని ఉరుమ్‌కీలో కొవిడ్ వ్యాప్తిని పూర్తిగా అరికట్టేందుకు జీరో కోవిడ్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. దీంతో అపార్ట్‌మెంట్ ముందు కార్లు పెద్దసంఖ్యలో పార్కు‌చేసి ఉంది. ఫైరింజన్లు ఆ ప్రదేశానికి వచ్చేందుకు సుమారు మూడు గంటలు పట్టిందని, ఈ సమయంలో మంటలు అపార్ట్‌మెంట్‌లో అధిక ప్రాంతాన్ని ఆక్రమించడంతో పదిమంది మరణించడానికి కారణమైందని స్థానికులు తెలిపారు.

Fire Accident In China: చైనాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. 10మంది మృతి.. జీరో కోవిడ్ ఆంక్షలే కారణమా?

China Fir accident

Fire Accident In China: వాయువ్య చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్స్ టియాన్‌షాన్ జిల్లా ఉరుంకిలో ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 10మంది సజీవదహనం అయ్యారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. తొమ్మిది మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘోర ప్రమాదం గురువారం రాత్రి 8గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. మంటలు అపార్ట్‌మెంట్‌లోని 15వ అంతస్తు నుండి 17వ అంతస్తు వరకు వ్యాపించడంతో.. 21వ అంతస్తు వరకు పొగలు కమ్ముకున్నాయి. మంటలను ఆర్పేందుకు దాదాపు మూడు గంటల సమయం పట్టింది.

Fire Accident In China: చైనాలోని ఓ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. 36 మంది సజీవదహనం

15వ అంతస్తు ప్లాట్‌లోని బెడ్‌రూంలో నుంచి మంటలు చెలరేగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అయితే, ఆ ప్రాంతంలో జీరోకోవిడ్ ఆంక్షలు ఉండటం వల్ల గ్రౌండ్ ఫ్లోర్‌లోని డోర్‌కు అధికారులు తాళం వేయడంతో అగ్నిప్రమాదం సమయంలో అపార్ట్‌మెంట్ బయటికి వెళ్లలేకపోయారు. చాలామంది నివాసితులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి మొదటి, రెండవ అంతస్తుల నుండి దూకారు. ఈ సంఘటనను వివరిస్తూ.. స్థానిక వ్యక్తి చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో వివరణాత్మక పోస్ట్ చేశారు. అగ్నిప్రమాదం గురించి అతని కుటుంబ సభ్యులకు ఏమీ తెలియదు. అతని తల్లి వంట చేస్తోంది, సోదరి పడకగదిలో హోంవర్క్ చేస్తోంది. కిటికీలోంచి పెద్ద ఎత్తున మంటలు రావడాన్ని గమనించిన తర్వాతే మేడమీద మంటలు చెలరేగుతున్నాయని వారు గ్రహించారు. తల్లిదండ్రులు వేగంగా పరిగెత్తారు, తదుపరి అంతస్తులో యూనిట్ తలుపు లాక్ చేయబడి ఉంది. చివరకు మొదటి అంతస్తులోని ఇరుగుపొరుగు ఇంటి కిటికీలోంచి దూకారు. ఈ అగ్నిప్రమాదంలో 10మంది అగ్ని ప్రమాదం సమయంలో తప్పించుకొనే పరిస్థితి లేకనే చనిపోయారని తెలిపాడు. ఈ అగ్ని ప్రమాదంలో ఐదేళ్ల చిన్నారి సహా ముగ్గురు చిన్నారులు చనిపోయారు.

China Restaurant Fire: చైనాలోని ఓ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 17మంది మృతి

చైనాలో కొవిడ్ మళ్లీ విజృంభిస్తోంది. అయితే గత 109రోజులుగా జిన్‌జియాంగ్ ప్రావిన్స్ రాజధాని ఉరుమ్‌కీలో కొవిడ్ వ్యాప్తిని పూర్తిగా అరికట్టేందుకు జీరో కోవిడ్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. దీంతో అపార్ట్‌మెంట్ ముందు కార్లు పెద్దసంఖ్యలో పార్కు‌చేసి ఉంది. ఫైరింజన్లు ఆ ప్రదేశానికి వచ్చేందుకు సుమారు మూడు గంటలు పట్టిందని, ఈ సమయంలో మంటలు అపార్ట్‌మెంట్‌లో అధిక ప్రాంతాన్ని ఆక్రమించడంతో పదిమంది మరణించడానికి కారణమైందని స్థానికులు తెలిపారు.