Fying Fish : పక్షిలాంటి చేప..రెక్కలతో గాలిలో ఎగురుతుంది.

సన్నని తోకతో గాలిపటంలా కనిపించే ఈ చేప నీటిలో ఈదుతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో తనకున్న రెండు రెక్కలతో నీటిపై భాగంలో ఎగురుతూ ప్రయాణించి తిరిగి నీటిలోకి చేరుతుంది.

Fying Fish : పక్షిలాంటి చేప..రెక్కలతో గాలిలో ఎగురుతుంది.

Fish

Fying Fish : సముద్రంలో నివశించే జీవులలో వివిధ రకాలు ఉన్నాయి. అందులోను చేపల్లో వివిధ రకాల జాతులు ఉన్నాయి. సొరచేప, తిమింగలం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల చేప జాతులు సముద్రంలో జీవిస్తున్నాయి. అయితే అలాంటి వాటిలో కొన్ని జాతులు చాలా ప్రత్యేక కలిగి ఉంటాయి. వాటిలో మొబులా రే చేప.. దీని గురించి చాలా మందికి తెలిసి ఉండదు. ఎందుకంటే ఇవి పక్షుల్లా గాలిలోకి ఎగరగలవు. రెక్కలు కలిగిన ఈ చేపలు మెక్సికో, కాలిఫోర్నియా సముద్ర తీరాల్లో ఎక్కువగా కనిపిస్తాయి.

సన్నని తోకతో గాలిపటంలా కనిపించే ఈ చేప నీటిలో ఈదుతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో తనకున్న రెండు రెక్కలతో నీటిపై భాగంలో ఎగురుతూ ప్రయాణించి తిరిగి నీటిలోకి చేరుతుంది. సముద్ర తీర ప్రాంతాల్లో ఎకువగా కనిపించే మొబులా రే చేపలు ఒకే చోట గుంపులుగా కనిపిస్తాయి. అవి ఉన్నప్రదేశం మొత్తం నీలం వర్ణంలో కనిపిస్తుంటుంది.

పెద్ద సైజులో ఉండే మొబులా రే చేపలు ఆహారం కోసం ఇలా ఎగురుతాయని తెలుస్తుంది. అవి ఎగిరనప్పుడు వాటి శరీరంపై నుండి కొన్ని నీటి బిందువులు క్రిందికి రాలుతాయి. అయితే వాటిని అహారంగా భావించి చిన్న చేపలు వచ్చి మొబులా రేలకు దొరికిపోతాయి. ఆచిన్న చేపల్ని ఇవి ఆహారంగా తీసుకుంటాయట. 17అడుగుల వెడల్పు, 10 అడుగుల పొడవు ఉండి సుమారు టన్ను బరువు వరకు పెరుగుతాయి. మెక్సీకో తీర ప్రాంతంలో అధికంగా కనిపించే వీటిని చూసేందుకు పర్యాటకులు అమితాసక్తి చూపిస్తుంటారు. వీటిని వేటాడి తిన్నవారికి మెక్సికోలో 10వేల డాలర్ల జరిమానా విధిస్తారు.