Nightclub Shooting: కొలరాడో గే నైట్ క్లబ్‌లో కాల్పులు.. ఐదుగురు మృతి.. 18 మందికి గాయాలు

అమెరికాలోని కొలరాడోలో ఉన్న ఒక గే నైట్ క్లబ్‌లో ఒక వ్యక్తి శనివారం రాత్రి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. మరో 18 మందికిపైగా గాయపడ్డారు.

Nightclub Shooting: కొలరాడో గే నైట్ క్లబ్‌లో కాల్పులు.. ఐదుగురు మృతి.. 18 మందికి గాయాలు

Nightclub Shooting: అమెరికాలోని కొలరాడో గే నైట్ క్లబ్‌లో ఒక దుండగుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు. మరో 18 మందికిపైగా గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

Suryakumar Yadav: సెంచరీతో చెలరేగిన సూర్య కుమార్.. న్యూజిలాండ్‌పై 65 పరుగుల తేడాతో ఇండియా ఘన విజయం

కొలరాడోలో ఉన్న ‘క్లబ్ క్యూ’ నైట్ క్లబ్‌లో సాయుధుడైన ఒక దుండగుడు తన దగ్గర ఉన్న తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, మరో 18 మంది గాయపడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నవంబర్ 20న ‘ట్రాన్స్‪జెండర్ డే ఆఫ్ రిమెంబ్రెన్స్ (టీడీఓఆర్)’గా జరుపుకొంటారు. ట్రాన్స్‌జెండర్లు, గేలు, లెస్బియన్లు ఈ డేను ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆ క్లబ్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

అయితే, ఇదే రోజును లక్ష్యంగా చేసుకుని దుండగుడు కాల్పులు జరిపాడు. ఇక.. గాయపడ్డవారిని పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నిందితుడు ఈ దారుణానికి పాల్పడటానికి గల కారణాలు తెలియరాలేదు.