Flying Car: ఎగిరే కారు వచ్చేస్తోంది.. సర్టిఫికేట్‌ వచ్చేసింది.. గాల్లో ప్రయాణించొచ్చు

గంటకు 160కిలోమీటర్ల వేగంతో 8వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో దూసుకెళ్లే సామర్థ్యం గల ఎగిరే కారుకు వాయుయోగ్యత సర్టిఫికేట్‌ లభించింది.

Flying Car: ఎగిరే కారు వచ్చేస్తోంది.. సర్టిఫికేట్‌ వచ్చేసింది.. గాల్లో ప్రయాణించొచ్చు

Air Car

Flying Car: గంటకు 160కిలోమీటర్ల వేగంతో 8వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో దూసుకెళ్లే సామర్థ్యం గల ఎగిరే కారుకు వాయుయోగ్యత సర్టిఫికేట్‌ను స్లోవాక్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ(Slovak Transport Authority) జారీ చేసింది.

ఈ హైబ్రిడ్ కార్-ఎయిర్‌క్రాఫ్ట్, AirCar, BMW ఇంజిన్‌తో అమర్చబడి సాధారణ పెట్రోల్‌తో నడిచేలా తయారుచేయబడింది. కారు నుండి విమానంగా రూపాంతరం చెందడానికి ఈ కారుకు రెండు నిమిషాల 15 సెకన్లు అవసరం అవుతుంది. 70గంటల పరీక్షలు, 200 టేకాఫ్‌లు, ల్యాండింగ్‌ల తర్వాత ఈ ఎయిర్‌కార్‌కు సర్టిఫికేట్ ఇచ్చినట్లుగా కంపెనీ తెలిపింది.

హైబ్రిడ్‌ కార్-ఎయిర్‌క్రాఫ్ట్ లేదా ఎయిర్‌‌కార్ అని పిలుస్తున్న ఈ ఎగిరే కారుకు బీఎండబ్ల్యూ ఇంజిన్‌ బిగించగా.. 8200 అడుగుల ఎత్తులో వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించగలదని ప్రయాణించగలదని తయారు చేసిన ప్రొఫెసర్‌ స్టీఫన్‌ క్లీన్‌ తెలిపారు. కేవలం 2 నిమిషాల 15 సెకన్లలో ఇది కారు నుంచి విమానంగా మారిపోతుంది.

కారుకు ఇరువైపులా చిన్న చిన్న రెక్కలు అమర్చి ఉండగా.. ఎగరే ముందు ఈ రెక్కలు విచ్చుకుని పక్షిలా మారిపోతుంది ఈ కారు. ఈ ఎయిర్‌కార్‌లో ఇద్దరు ప్రయాణించొచ్చు. ఈ ఎయిర్‌కార్‌ గరిష్టంగా 200 కిలోల బరువు మోయగలదు. డ్రోన్‌ల మాదిరిగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎగరలేదు. విమానంలానే టేకాఫ్‌, ల్యాండింగ్‌ చేయడానికి రన్‌వే అవసరం అవుతుంది.