ఇండియాకు రావాలంటే విదేశీ ప్రయాణికులు తప్పక తెలుసుకోవాలసినవి

ఇండియాకు రావాలంటే విదేశీ ప్రయాణికులు తప్పక తెలుసుకోవాలసినవి

విదేశాల నుంచి ఇండియాకు రాబోయే వారికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త గైడ్ లైన్స్‌ను ఇష్యూ చేసింది. కొత్త గైడ్ లైన్స్ ప్రకారం.. ప్యాసింజర్లను ఐదు కేటగిరీల వారీగా మినహాయింపు ఇచ్చారు. ఏడు రోజుల ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్ తో వారిని అనుమతిస్తున్నారు. ఆగష్టు 8నుంచి ఈ గైడ్ లైన్స్ వర్తిస్తాయి. యూఎస్, యూఏఈ, ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో ఏవైతే ఇరువైపులా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కు పర్మిషన్ ఇస్తాయో వాటికి మాత్రమే నిబంధనలు లేకుండా చేస్తున్నారు.

ఆగష్టు 8నుంచి ఇంటర్నేషనల్ ఎరైవల్స్ గైడ్ లెన్స్ ఇలా ఉన్నాయి:
1. ప్రయాణానికి 72 గంటల ముందే ట్రావెలర్స్ అంతా సెల్ఫ్ డిక్లరేషన్ ఫాం సబ్‌మిట్ చేయాలి.
2. ప్యాసింజర్లు ఏడు రోజుల ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్ కు వెళ్లేందుకు సిద్ధమని చెప్పాలి. హెల్త్ ను సెల్ఫ్ మానిటరింగ్ చేసుకుంటూ .. ఏడు రోజుల పాటు ఉండాలి.
3. ఈ నిబంధనల నుంచి ఐదు కేటగిరీల వారికి మాత్రం మినహాయింపు ఉంది. గర్భిణీలు, కుటుంబంలో ఎవరైనా చనిపోయినా, తీవ్రమైన జబ్బుతో బాధపడేవారు, 10ఏళ్ల లోపు పిల్లలతో పాటు ఉండే పేరెంట్స్, 96గంటల ముందుగా COVID-19 నెగెటివ్ సర్టిఫికేట్ పొందిన వారు.
4. ఇటువంటి మినహాయింపులు కావాలంటే వారంతా ఢిల్లీ ఎయిర్ పోర్టు పోర్టల్ లో బోర్డింగ్ కు 72 గంటల ముందే సంప్రదించాలి. ఆన్ లైన్ పోర్టల్ లో చెప్పిన నిర్ణయమే ఫైనల్.
5. ఇండియాకు రావాలనుకుంటున్న విదేశీ ప్రయాణికులు ఇదే పద్ధతిని ఫాలో అవ్వాలి. ఏడు రోజుల హోం క్వారంటైన్ తో పాటు మరో ఏడు రోజుల ఇన్‌స్టిట్యూషనల్ తమ సొంత ఖర్చుతోనే ఉండాలి.
6. విమానం ఎక్కడానికి మూడు వారాల ముందు కొవిడ్ టెస్ట్ చేయించుకోకపోతే వారు తప్పనిసరిగా సెల్ఫ్ డిక్లరేషన్ ఫాం సబ్‌మిట్ చేయాలి.

వీటన్నిటితో పాటు తప్పనిసరిగా ఆరోగ్యసేతు యాప్ మొబైల్ ఫోన్స్ లో ఉండాలి.

ప్రయాణంలో ఉన్నప్పుడు:
ఎయిర్‌పోర్టుల్లో.. బోర్డింగ్ సమయంలో వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా శానిటైజేషన్, డిసిన్ఫెక్షన్ వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. విమానంలో లేదా షిప్ లో ప్రయాణిస్తున్నప్పుడు మాస్క్ లు, హైజిన్, రోగనిరోధక హైజిన్, హ్యాండ్ హైజిన్ లు ఎయిర్ లైన్, షిప్ స్టాఫ్, సిబ్బంది, ప్రయాణికులంతా వాడాలి.

గమ్యాలకు చేరుకునే సమయంలో:
గమ్యాలకు చేరుకునే సమయంలో గైడ్ లైన్స్ పాటిస్తూ సోషల్ డిస్టెన్స్ తో కిందకు రావాలి. ఎయిర్ పోర్ట్/ సీ పోర్ట్/ ల్యాండ్ పోర్ట్ వద్ద ఉన్న హెల్త్ అఫీషియల్స్ వారు నిర్వహించే థర్మల్ స్క్రీనింగ్ కు కోపరేట్ చేయాలి. సెల్ఫ్ డిక్లరేషన్ ఫాంను వారికి తప్పనిసరిగా ఇవ్వాలి.

ప్రోటోకాల్ ఆధారంగా స్క్రీనింగ్ లో ఏదైనా తేడాగా అనిపిస్తే వారిని వెంటనే మెడికల్ ఫెసిలిటీతో హాస్పిటల్ కు పంపిస్తారు.