Anand Mahindra : ‘ఫోల్డబుల్ హౌస్’ చూసారా? తనకు చాలా నచ్చిందంటున్న ఆనంద్ మహీంద్రా

400 చదరపు గజాల స్థలం ఉంటే చాలు.. ఆ ఇంటిని ఇన్ స్టాల్ చేసేసుకోవచ్చు. సకల సౌకర్యాలతో ఉండే ఆ ఇల్లు ధర భారతీయ కరెన్సీలో రూ.40 లక్షలు. అమెరిన్ హౌసింగ్ నిర్మాణ సంస్థ తయారు చేస్తున్న ఈ ఇల్లు వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రాకు ఎంతగానో నచ్చేసింది.

Anand Mahindra : ‘ఫోల్డబుల్ హౌస్’ చూసారా? తనకు చాలా నచ్చిందంటున్న ఆనంద్ మహీంద్రా

Anand Mahindra

Viral Video : వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఎప్పుడూ ఏదో ఒక వార్త షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ‘ఫోల్డబుల్ ఇంటి’ని షేర్ చేసారు. దీని గురించి తెలుసుకోవాలని ఉందా?

Anand Mahindra : నా ఇద్దరి మనవల భద్రత నాకు ముఖ్యం.. అంటూ ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ వైరల్

పోర్టబుల్ హౌస్‌ను లాస్ వెగాస్‌లో ఉన్న ఒక అమెరికన్ హౌసింగ్ నిర్మాణ సంస్థ Boxabl నిర్మించింది. ఈ ఇంటి ప్రత్యేకత ఏంటి? అంటే 400 చదరపు అడుగుల్లో ఈ ఇల్లు ఉంటుంది. కనెక్టర్ ప్లేట్స్ ఉపయోగించి ఒకే ఒక్క రోజులో మనకి కావాల్సిన చోట ఇల్లును ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. దీనిని చేరవేయడానికి పికప్ ట్రక్కును వాడతారు. ఈ ఇంటి ధర $49,500 (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 40,00,000) అన్నమాట. ఈ ఇంట్లో సకల సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవచ్చును. ఈ ఇల్లు ఇప్పుడు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాను ఆకర్షించింది.

 

ఆనంద్ మహీంద్రా ఫోల్డబుల్ ఇల్లు ఇన్ స్టాల్ చేసే వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘ఈ ఇంటిని అద్భుతంగా భావిస్తున్నాను. ఇండియాలో ఇల్లు కట్టుకోవడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. తక్కువ ఖర్చుతో ఎలా నిర్మాణం చేపట్టవచ్చు అనేది కూడా మనం అన్వేషించాలని’ చెబుతూ షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

Anand Mahindra : కొత్త కారు కొన్న ఆనందంలో డ్యాన్స్ చేసిన కుటుంబం.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్

ఆనంద్ మహీంద్రా ట్వీట్‌ను చాలామంది సపోర్ట్ చేశారు. ‘అయితే ఇండియాలో జనాభా ఎక్కువ కాబట్టి ఇలాంటి ఇల్లు బహుళ అంతస్తుల్లో ఉండాలని .. జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇలాంటివి ఉపయోగపడకపోవచ్చని’ అభిప్రాయాలు చెప్పారు. ఈ ఫోల్డబుల్ ఇల్లు మాత్రం అందర్నీ ఆకర్షిస్తోంది.