Anand Mahindra : కొత్త కారు కొన్న ఆనందంలో డ్యాన్స్ చేసిన కుటుంబం.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్
కొన్ని కొనాలంటే కొన్నేళ్లు కలలు కనాలి. ఆ కల నెరవేరిన సందర్భంలో ఆనందం అంబరాన్ని అంటుతుంది. తమ పెళ్లిరోజున మహీంద్రా కారును కొనుగోలు చేసిన ఓ కుటుంబం కారు డెలివరీ సందర్భంలో డ్యాన్స్ చేసింది. వారి ఆనందం చూసిన ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

Anand Mahindra
family dancing after buying a new car : ఓ జంట తమ 23వ పెళ్లిరోజు సందర్భంగా కారు కొనుగోలు చేశారు. ఆ సంబరంలో డ్యాన్స్ చేసారు. వీరి డ్యాన్స్ వీడియో చూసి ముచ్చటపడిన వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
Anand Mahindra : మహీంద్రా కార్లకు నో చెప్పండి .. ఆనంద్ మహీంద్రా ట్వీట్‌కి నెటిజన్ల ఘాటు రిప్లై..
చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఓ కుటుంబం మహీంద్రా స్కార్పియో-N SUVని కొనుగోలు చేసింది. తమ కల నెరవేరిన ఆనందంతో కారు డెలివరీ సమయంలో ఆ ఫ్యామిలీ ఎంతో సంతోషంగా డ్యాన్స్ చేసింది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా కారు డెలివరీ చేస్తున్నప్పుడు ఫ్యామిలీ చేసిన డ్యాన్స్ ఫోటోలు, వీడియోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘గత 23 ఏళ్లగా ఎన్నో కార్లను డెలివరీ చేసినా మిస్టర్ దీనానాథ్ సాహు దంపతుల 23వ పెళ్లిరోజు సందర్భంలో కారును డెలివరీ చేయడం మాత్రం ప్రత్యేకం’ అని శీర్షికను కూడా పెట్టారు.
దీనానాథ్ సాహు కుటుంబం ఆనందాన్ని వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా కూడా ఆశ్చర్యపోయారు. ఆటోమొబైల్ తయారీ రంగంలో భాగమైనందుకు ప్రజల ఆనందమే “నిజమైన ప్రతిఫలం” అంటూ ట్వీట్ చేశారు. ఇక ఈ వీడియోకి మరింత హైప్ వచ్చి వ్యూస్‌తో దూసుకుపోతోంది. ‘జీవితంలో కొన్ని విషయాలు స్వచ్ఛమైన ఆనందాన్ని ఇస్తాయని ఒకరు’.. ‘భారతదేశంలో కారు కొనడం అంటే చిన్న విషయం కాదు.. కుటుంబసభ్యులు అందరూ బాగా డ్యాన్స్ చేసారు’ అని మరికొందరు వీడియోపై కామెంట్లు పెట్టారు.
JOY OF BUYING YOUR OWN VEHICLE.
Of all the deliveries I have seen over the last 23 yrs … this is the one I loved the most. Mr Dinanath Sahu along with his family on his 23rd Marriage Anniversary.
Car is such a passion
We will keep fulfilling the Dreams of our Customers. pic.twitter.com/iqRTA53NWo
— Manish Raj Singhania (@manish_raj74) May 16, 2023
This is the real reward and joy of working in the Indian auto industry… https://t.co/ormA7i8sQq
— anand mahindra (@anandmahindra) May 19, 2023