Anand Mahindra : నా ఇద్దరి మనవల భద్రత నాకు ముఖ్యం.. అంటూ ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ వైరల్
ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. తాజాగా మార్కెట్లోకి వచ్చిన చిన్నపిల్లల స్విమ్ సూట్‌పై ట్వీట్ చేశారు. దానికి సంబంధించిన వీడియోని కూడా షేర్ చేశారు. చిన్నపిల్లల భద్రత, శ్రేయస్సు గురించి ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

Anand Mahindra
Anand Mahindra tweet viral : చిన్నపిల్లలు స్విమ్మింగ్ పూల్ చూస్తే స్విమ్ చేయాలని ముచ్చట పడతారు. వారి ఇష్టాల్ని నెరవేర్చడానికి పెద్దవాళ్లు ఎంకరేజ్ చేస్తుంటారు. ఒక్కోసారి చిన్నపాటి నిర్లక్ష్యాలు వారి ప్రాణాల మీదకు తెస్తుంటాయి. అయితే వారి కోసమే ప్రత్యేకంగా మార్కెట్లోకి వచ్చిన ఓ స్విమ్ సూట్ వీడియో చూసి టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
ఆనంద్ మహీంద్రా చేసే ట్వీట్స్ ఫన్నీగా, నవ్వు తెప్పించేవిగా.. ఆలోచించేవిగా, అవగాహన కల్పించేవిగా ఉంటాయి. చాలామంది ఆయన ట్వీట్స్ కోసం వెయిట్ చేస్తుంటారు కూడా. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ నిజంగా పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు ఎంత జాగ్రత్త తీసుకోవాలనే విషయాన్ని గుర్తు చేసింది. ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసిన వీడియోలో ఓ వ్యక్తి పిల్లలు ధరించే సరికొత్త స్విమ్ సూట్‌ను పరిచయం చేస్తాడు. అది ధరించి వారు పూల్‌లోకి దిగిన తర్వాత రక్షణ కవచంలా ఎలా పనిచేస్తుందో ప్రయోగాత్మకంగా చూపించాడు. పిల్లల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఈ స్విమ్ సూట్ ఆనంద్ మహీంద్రాను ఆకర్షించింది. వెంటనే ఈ వీడియోని తన అకౌంట్ లో షేర్ చేసుకున్నారు.
Anand Mahindra : కొత్త కారు కొన్న ఆనందంలో డ్యాన్స్ చేసిన కుటుంబం.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్
‘నోబెల్ బహుమతి రాకపోయినా గొప్ప ఆవిష్కరణ ఇది. ఎందుకంటే ఇద్దరు చిన్నపిల్లలకు తాతగా వారి శ్రేయస్సు, భద్రత నాకు ముఖ్యం’ అనే శీర్షికతో ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ‘అమేజింగ్’ అని, ‘చాలా జాగ్రత్తలు తీసుకునే తాతగారు మీరు’ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
This may not get a Nobel prize but it ranks higher than those inventions for me. Because as the grandfather of two young kids, their wellbeing & safety is my highest priority. 👏🏽👏🏽👏🏽 (video credit: @Rainmaker1973 ) pic.twitter.com/ZaSyVMqZG9
— anand mahindra (@anandmahindra) May 25, 2023