ఆకాశంలో ఎగిరే పిజ్జాలు.. డ్రోన్ల ద్వారా ఫుడ్ డెలివరీ.. భవిష్యత్తులో జరగబోయేది ఇదే

ఆకాశంలో ఎగిరే పిజ్జాలు.. డ్రోన్ల ద్వారా ఫుడ్ డెలివరీ.. భవిష్యత్తులో జరగబోయేది ఇదే

Food delivery by drone: ఇప్పుడు టెక్నాలజీ యుగం నడుస్తోంది. అన్ని రంగాల్లో టెక్నాలజీని బాగా వినియోగిస్తున్నారు. సాంకేతికత ద్వారా అన్ని పనులు సులభంగా జరిగిపోతున్నాయి. టెక్నాలజీలో భాగంగానే డ్రోన్లను తీసుకొచ్చారు. ఇప్పటికే పలు రంగాల్లో డ్రోన్ల వాడకం బాగా పెరిగింది. డ్రోన్ల సాయంతో గస్తీ కాస్తున్నారు. పొలాల్లో మందులు పిచికారీ చేస్తున్నారు. మనిషి అవసరం లేకుండానే, పెద్దగా శ్రమించకుండానే అన్ని పనులను డ్రోన్లు చేస్తున్నాయి. ఇప్పుడు మరో అడుగు ముందుకు పడింది. డ్రోన్ల సాయంతో ఫుడ్ డెలివరీ చేయనున్నారు. అవును పిజ్జా, ఫుడ్ డెలివరీ వంటి అంశాల్లో డ్రోన్లు కీ రోల్ ప్లే చేయనున్నాయి. భవిష్యత్తుల్లో ఫుడ్ డెలివరీలో డ్రోన్లు భాగం కానున్నాయి.

ఇజ్రాయిల్ లో ఫుడ్ డెలివరీకి డ్రోన్లు వినియోగించనున్నారు. ఈ దిశగా చర్యలను ముమ్మరం చేశారు. ఇప్పటికే ట్రయల్స్ చేస్తున్నారు. పిజ్జా హట్ నుంచి పార్కింగ్ లాట్స్ కు పిజ్జాలను డ్రోన్ల ద్వారా డెలివరీ చేస్తున్నారు. పార్కింగ్ లాట్స్ దగ్గర ఉండే డ్రైవర్లు.. డ్రోన్ల ద్వారా వచ్చిన ఫుడ్ ని, పిజ్జా బాక్సులను తీసుకుని కస్టమర్లకు డెలివరీ చేస్తున్నారు. ఆ విధంగా మరింత వేగంగా పిజ్జాలను కస్టమర్లకు అందించొచ్చు.

A drone delivers Pizza Hut orders over central Israel.

యూపీఎస్, ఆల్ఫాబెట్, ఫెడ్ ఎక్స్, అమెజాన్(amazon), వాల్ మార్ట్(walmart) వంటి దిగ్గజాలు.. డ్రోన్ల ద్వారా ఫుడ్ డెలివరీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి. భవిష్యత్తులో అంటే 2035నాటికి ఈ తరహా బిజినెస్ 115 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని డెలాయిట్(deloitte) అంచనా వేసింది. మాకు ఎగిరే బర్గర్లు కావాలి అని ఉబెర్ సీఈవో(uber ceo) దారా కోట్ చేశారు. 2019లో స్యాన్ డీగో లో ఉబెర్ ఈట్స్(uber eats), మెక్ డొనాల్డ్స్(mc donalds) డ్రోన్ డెలివరీ ప్రయత్నం చేశాయి. ఆ సమయంలో ఆయనీ కోట్ చేశారు.

ఇజ్రాయిల్ లో డ్రోన్లు ఎలా పని చేస్తున్నాయి:

* ఫ్లోరిడాలోని గ్రామాల్లో డ్రోన్ ద్వారా వస్తువులు డెలివరీ చేసేందుకు వెరిజాన్, యూపీఎస్ ప్లాన్ చేశాయి.

* ఫుల్లీ ఆటోమేటేడ్ డ్రోన్లు పూర్తిగా వినియోగించేందుకు మాసాచుట్స్ కంపెనీకి ఎఫ్ఏఏ అనుమతి ఇచ్చింది.

* డ్రోన్ల ద్వారా కొవిడ్ వ్యాక్సిన్లను డెలివరీ చేసేందుకు కొన్ని కంపెనీలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.

* ఇజ్రాయిల్ లోని ఓ రెస్టారెంట్ డ్రోన్ ద్వారా పిజ్జా డెలివరీ చేసేందుకు ట్రయల్స్ చేసింది.

* గత జూన్ లో కమర్షియల్ ప్రయోగం చేశారు. 12 డ్రోన్ల ద్వారా పిజ్జాలు డెలివరీ చేశారు. వాటికి పారాచూట్స్ తగిలించారు. పొరపాటున జనాల తల మీద పడినా ప్రమాదం లేకుండా ఏర్పాటు చేశారు.

* ప్రస్తుతానికి డ్రోన్లు 5.5 పౌండ్ల బరువు(రెండు పిజ్జాలు, ఒక కోక్ బాటిల్) మాత్రమే మోస్తున్నాయి.

డ్రోన్ డెలివరీ వల్ల లాభాలు:

* రోడ్లపై ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు పిజ్జాలు ఫాస్ట్ గా డెలివరీ చేయడానికి డ్రోన్లు బాగా ఉపయోగపడతాయి.

* పిజ్జా తయారీ మొదలు గాల్లో ప్రయాణం, డెలివరీ బాయ్ ని ఎప్పుడు చేరాయి.. ఇలాంటి విషయాలను కస్టమర్లు ట్రాక్ చేయొచ్చు.

* నదులు ఉన్న చోట డ్రోన్లు బాగా ఉపయోగపడతాయి.

వాట్ నెక్ట్స్:

* పాపా జాన్స్, స్వీట్ గ్రీన్ తో డ్రాగన్ టెయిల్ డెలివరీ డీల్ కుదుర్చుకుంది.

* ఎయిర్ లిఫ్ట్ సంగతికి వస్తే పిజ్జా మోస్ట్ చాలెంజింగ్ ఫుడ్. ఎందుకంటే సుషి, బర్గర్లతో పోలిస్తే పిజ్జాలు ఎక్కువ బరువుగా ఉంటాయి.

* సలాడ్స్ లాంటి విషయానికి వస్తే ఒక్కో డ్రోన్ తో 5 మీల్స్ డెలివరీ చేయొచ్చు. సలాడ్స్ వంటి డెలివరీ విషయంలో డ్రోన్లు మరింత ఎఫెక్టివ్ గా పని చేస్తాయి.