Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్!

గతేడాది అవిశ్వాస పరీక్ష ద్వారా ఇమ్రాన్ ఖాన్ తన ప్రధానమంత్రి పదవిని కోల్పోయారు. అనంతరం ఆయన వందల కేసుల్లో చిక్కుకున్నారు. రష్యా, చైనా, ఆఫ్ఘనిస్తాన్‌లతో పాక్ స్నేహాన్ని చేయడం, తమ స్వతంత్ర విదేశాంగ విధానాలను పాటించడం అమెరికాకు నచ్చలేదని, అందుకే తనను లక్ష్యంగా చేసుకున్నట్లు ఆయన పలు సందర్భాల్లో అభిప్రాయపడ్డారు.

Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్!

Imran Khan with his supporters (file photo)

Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్‭ను మంగళవారం అరెస్ట్ చేశారు. ఇస్లామాబాద్ హైకోర్టు సమీపంలో ఆయనను పాకిస్తాన్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. ఇమ్రాన్ ఖాన్ అరెస్టును పీటీఐ నేత ముసర్రాత్ చీమ మొదటగా ప్రకటించారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ ‘‘వాళ్లు ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్‭ను హింసిస్తున్నారు. తీవ్రంగా కొడుతున్నారు. వాళ్లు ఆయనను ఏదైనా చేస్తారు’’ అని ట్వీట్ చేశారు.

Sachin Pilot : రాజస్థాన్ కాంగ్రెస్ లో మరోసారి అంతర్గత విభేదాలు.. పార్టీ అనుమతి లేకుండా పాదయాత్రకు సిద్ధమైన సచిన్ పైలెట్

అల్ఖదీర్ ట్రస్ట్ కేసులో ఇమ్రాన్ ఖాన్‭ను అరెస్ట్ చేశారు. ఇస్లామాబాద్ హైకోర్టు వెలుపల ఇమ్రాన్ అరెస్ట్‭ను పిటిఐ లాయర్లు అడ్డుకున్నారు. హైకోర్టు వద్ద భద్రతా బలగాలు లాయర్లకు మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు లాయర్లకు గాయాలు అయ్యాయి. ఇమ్రాన్ ఖాన్‭ను రిమాండుకు తరలించేందుకు రేంజర్లు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. పాకిస్తాన్ ప్రతిపక్ష నేతగా ఉన్న ఇమ్రాన్.. ప్రస్తుత దేశ ఆర్ధిక పరిస్థితి, ప్రభుత్వ నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Israel : ఇజ్రాయిల్ దళాల దాడులు.. ముగ్గురు ఇస్లామిక్ జిహాదీ కమాండర్లు హతం

గతేడాది అవిశ్వాస పరీక్ష ద్వారా ఇమ్రాన్ ఖాన్ తన ప్రధానమంత్రి పదవిని కోల్పోయారు. అనంతరం ఆయన వందల కేసుల్లో చిక్కుకున్నారు. రష్యా, చైనా, ఆఫ్ఘనిస్తాన్‌లతో పాక్ స్నేహాన్ని చేయడం, తమ స్వతంత్ర విదేశాంగ విధానాలను పాటించడం అమెరికాకు నచ్చలేదని, అందుకే తనను లక్ష్యంగా చేసుకున్నట్లు ఆయన పలు సందర్భాల్లో అభిప్రాయపడ్డారు. నిజానికి కొద్ది రోజుల ముందే దేశంలో సాధారణ ఎన్నికలు జరపాలని అధికార పక్షం, విపక్ష పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. అంతలోనే ఇమ్రాన్ అరెస్ట్ కావడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.