Imran Khan: అన్ని పార్లమెంట్ స్థానాల్లో ఒకే ఒక్కడు.. 33 స్థానాల్లో పోటీ చేయనున్న ఇమ్రాన్ ఖాన్

త్వరలో పాకిస్తాన్ అసెంబ్లీకి జరగబోయే ఉప ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ ఇమ్రాన్ ఖాన్ ఒక్కడే పోటీ చేయాలని పార్టీ తీర్మానించింది. దీంతో 33 అసెంబ్లీ స్థానాల్లో ఇమ్రాన్ ఖాన్ ఒక్కడే పోటీ చేయబోతున్నాడు. ఈ విషయాన్ని పార్టీ వైస్ ఛైర్మన్ షా మహమూద్ ఖురేషి వెల్లడించారు.

Imran Khan: అన్ని పార్లమెంట్ స్థానాల్లో ఒకే ఒక్కడు.. 33 స్థానాల్లో పోటీ చేయనున్న ఇమ్రాన్ ఖాన్

Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆధ్వర్యంలోని పీటీఐ (పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్) పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో పాకిస్తాన్ అసెంబ్లీకి జరగబోయే ఉప ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ ఇమ్రాన్ ఖాన్ ఒక్కడే పోటీ చేయాలని పార్టీ తీర్మానించింది.

Australia: ఖలిస్తాన్ మద్దతుదారుల అరాచకం.. ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడి

దీంతో 33 అసెంబ్లీ స్థానాల్లో ఇమ్రాన్ ఖాన్ ఒక్కడే పోటీ చేయబోతున్నాడు. ఈ విషయాన్ని పార్టీ వైస్ ఛైర్మన్ షా మహమూద్ ఖురేషి వెల్లడించారు. ఆదివారం సాయంత్రం జరిగిన పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. పాక్ ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ గత ఏడాది ఏప్రిల్‌లో పదవి కోల్పోయిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ దిగువ సభ అయిన అసెంబ్లీ నుంచి ఆయన పార్టీ పీటీఐ పూర్తిగా వైదొలిగింది. దీంతో అనేక స్థానాలు ఖాళీ ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఖాళీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని పాకిస్తాన్ ఎన్నికల సంఘం నిర్ణయించింది.

Budget Session: రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్న ప్రభుత్వం

దీంతో 33 అసెంబ్లీ స్థానాలకు వచ్చే మార్చి 16న ఉప ఎన్నికలు జరగనున్నాయి. పీటీఐ పార్టీ నిర్ణయం ప్రకారం.. ఈ ఎన్నికల్లో 33 స్థానాల్లో ఆ పార్టీ తరఫున ఇమ్రాన్ ఖాన్ ఒక్కడే పోటీ చేయనున్నాడు. ఈ 33 అసెంబ్లీ స్థానాల్లో పంజాబ్ ప్రావిన్స్‌లో 12, ఖైబర్ పంక్తుఖ్వాలో 8, ఇస్లామాబాద్‌లో 3, సింధ్ ప్రావిన్స్‌లో 9, బలూచిస్తాన్‌లో ఒక స్థానం ఖాళీ ఉన్నాయి. గత అక్టోబర్‌లో కూడా ఇమ్రాన్ ఖాన్ 8 పార్లమెంటరీ స్థానాలకు పోటీ చేశారు. అందులో 6 స్థానాల్లో విజయం సాధించారు.