Covid-19: ఐదు సింహాలకు కొవిడ్ పాజిటివ్ అంటించిన జూ సిబ్బంది

సింగపూర్ లోని ఒక జూలో నాలుగు సింహాలకు కొవిడ్ పాజిటివ్ అని తేలింది. స్టాఫ్ నుంచి వాటికి కొవిడ్ సోకినట్లుగా నిర్ధారించారు. 'సింహాలన్నీ చురుగ్గా ఉంటున్నాయి. బాగానే తింటున్నాయి' .

Covid-19: ఐదు సింహాలకు కొవిడ్ పాజిటివ్ అంటించిన జూ సిబ్బంది

Singapore Zoo

Covid-19: సింగపూర్ లోని ఒక జూలో నాలుగు సింహాలకు కొవిడ్ పాజిటివ్ అని తేలింది. స్టాఫ్ నుంచి వాటికి కొవిడ్ సోకినట్లుగా నిర్ధారించారు. ‘సింహాలన్నీ చురుగ్గా ఉంటున్నాయి. బాగానే తింటున్నాయి’ అని మీడియాతో చెప్పారు మండైయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ డా. సోంజా.

దేశవ్యాప్తంగా తాజాగా 3వేల 397 కేసులు నమోదు కాగా, అందులో 169మంది వలస కార్మికులు కూడా ఉన్నారు. అలా మొత్తానికి 2లక్షల 24వేల 200కు చేరాయి. కరోనా మృతుల సంఖ్య 523కు చేరిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

నైట్ సఫారీ ప్రాంతంలో నాలుగు ఏసియాటిక్ సింహాలకు పాజిటివ్ అని తేలింది. శనివారం దగ్గడం, తుమ్మడం వంటి లక్షణాలు కనిపించాయి.

…………………………………..: పాపం అషూ పాప ఆశ తీరేదెప్పుడో?!

‘మండాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్ స్టాఫ్ కు కూడా కొవిడ్ పాజిటివ్ ఉండటంతో వారి నుంచే సంక్రమించి ఉండొచ్చని భావిస్తున్నారు. పీసీఆర్ టెస్టులు నిర్వహించి నాలుగు సింహాలకు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. దక్షిణాఫ్రికాకు చెందిన మరో సింహానికి కూడా లక్షణాలు కనిపించడంతో టెస్టుకు పంపించారు.

జూ ఆపరేటర్ ఆదేశాలకు మేరకు సిబ్బంది మొత్తానికి మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించారు. డ్యూటీలో లేని వారిని సైతం పిలిపించి నవంబర్ 8నుంచి విధుల్లో ఉన్నవారిని పరీక్షిస్తున్నారు. అక్కడ పనిచేసే సిబ్బందిలో 99.5శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారని.. అన్ని జాగ్రత్తలు తీసుకునే జూ నిర్వహిస్తున్నామని అధికారులు అంటున్నారు.