Indian Origin People Kidnapped In US: అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తులు కిడ్నాప్.. ఎనిమిది నెలల పాప కూడా..

అమెరికాలో భారత సంతతికి చెందిన నలుగురు వ్యక్తులు కిడ్నాప్ అయ్యారు. సోమవారం కాలిఫోర్నియాలోని మెర్సిడ్ కౌంటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. గుర్తుతెలియని దుండగులు వీరిని కిడ్నాప్ చేసినట్లు తెలిసింది. కిడ్నాప్ కు గురైన వారిలో ఎనిమిది నెలల పాప కూడా ఉంది.

Indian Origin People Kidnapped In US: అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తులు కిడ్నాప్.. ఎనిమిది నెలల పాప కూడా..

4 Indian-Origin People Kidnapped In US

Indian Origin People Kidnapped In US: అమెరికాలో భారత సంతతికి చెందిన నలుగురు వ్యక్తులు కిడ్నాప్ అయ్యారు. సోమవారం కాలిఫోర్నియాలోని మెర్సిడ్ కౌంటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. గుర్తుతెలియని దుండగులు వీరిని కిడ్నాప్ చేసినట్లు తెలిసింది. కిడ్నాప్ కు గురైన వారిలో ఎనిమిది నెలల పాప అరూహి ధేరి కూడా ఉంది. ఆయుదాలతో బెదిరించి వీరిని కిడ్నాప్ చేసినట్లు మెర్సిడ్ కౌంటీ షెరీఫ్ వెల్లడించారు. నిందితులు ఆయుధాలు కలిగి ఉన్నట్లు, వారు ప్రమాదకరమైన వారని పోలీసులు తెలిపారు.

Amit Shah visits Jammu Kashmir: అమిత్ షా జమ్మూకశ్మీర్ పర్యటన షురూ.. భారీ బందోబస్తు

అమెరికాలోని మెర్సిడ్ కౌంటీలో నివాసముంటున్న 36ఏళ్ల జస్దీప్ సింగ్, 27 ఏళ్ల జస్లీన్ కౌర్, వారి ఎనిమిది నెలల చిన్నారి అరూహి ధేరితో పాటు 39 ఏళ్ల అమన్‌దీప్ సింగ్‌ను కిడ్నాపర్లు తీసుకెళ్లినట్లు అక్కడి అధికారులు తెలిపారు. దర్యాప్తును ప్రారంభించామని, ఈ ఘటనపై వివరాలను సేకరిస్తున్నామని అన్నారు. వీరిని కిడ్నాప్ చేసిన స్థలం రెస్టారెంట్లు, ఇతర వ్యాపారాలు ఉండే ప్రాంతం అని పోలీసులు తెలిపారు. కిడ్నాపర్ల నుంచి ఎటువంటి ప్రతిపాదనలు ఇప్పటి వరకు అందలేదని, అనుమానిత బాధిత వివరాలు తెలిస్తే 911కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీస్ అధికారులు సూచించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఇదిలాఉంటే.. 2019 సంవత్సరంలో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. యూఎస్ లోని డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ యాజమానిని కాలిఫోర్నియాలోని ఇంటి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. అయితే కొద్దిగంటల వ్యవధిలోనే వారి మృతదేహాలు కారులో లభ్యమయ్యాయి.