రెండు తుఫాన్‌లు ఢీకొంటే ఏమౌతుంది? పుజివారా ఎఫెక్ట్ ఏంటి? అదేలా ఏర్పడుతుంది?

  • Published By: sreehari ,Published On : August 22, 2020 / 05:00 PM IST
రెండు తుఫాన్‌లు ఢీకొంటే ఏమౌతుంది? పుజివారా ఎఫెక్ట్ ఏంటి? అదేలా ఏర్పడుతుంది?

తుఫాన్.. అంటేనే బీభత్సం.. అలాంటిది ఒక తుఫాన్‌కు తోడు మరో తుఫాన్ తోడైతే.. ఒక పెను తుఫానుగా మారుతుంది.. సాధారణ తుఫాన్‌కే అల్లకల్లోలం అవుతుంది.. మరి రెండు తుఫానులు ఒక చోట కలిస్తే వినాశనమే.. రెండు తుఫానులు దగ్గరగా ఉంటే.. ఒకదానిలో ఒకటి విలీనమైపోతాయి..

నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకారం.. రెండు తుఫానుల మధ్య పుట్టే చర్యను ‘ఫుజివారా ఎఫెక్ట్’ అంటారు. జపనీస్ వాతావరణ శాస్త్రవేత్త సాకుహేయ్ ఇలా రెండు తుఫానులు ఢీకొనడాన్ని ఫుజివారా అని పేరు పెట్టారు..



ఒకదానికొకటి 680 మైళ్ళ దూరంలో ఉన్నప్పుడు ఒక పెద్ద తుఫానుగా విలీనం కావచ్చునని చెబుతోంది. రెండు లేదా ఎక్కువ తుఫానులు ఢీకొన్నప్పుడు ఏర్పడుతుంది.. ఫుజివారా ప్రభావంలో చిన్న హరికేన్ సెంట్రల్ పాయింట్ పెద్దది కంటే వేగంగా కదులుతుంది..  దీనిని మొదట 1921లో ఆయన వర్ణించారు. వేడెక్కే వాతావరణం హరికేన్ సీజన్‌ను ప్రభావితం చేస్తుందని సూచించారు.

నేషనల్ వెదర్ సర్వీస్ ఫుజివారా ప్రభావాన్ని రెండు సమీప ఉష్ణమండల తుఫానులు ఒకదానికొకటి తుఫానుగా మారుతుందని వివరించింది. నేషనల్ వెదర్ సర్వీస్ నుండి ఫుజివారా ప్రభావం అంటే ఒక బైనరీ ఇంటరాక్షన్ గా పేర్కొంది. ఫుజివారా అధ్యయనాలు తుఫానులు సాధారణ కేంద్రం చుట్టూ తిరుగుతాయని సూచిస్తున్నాయి.



1995లో అట్లాంటిక్‌లో నాలుగు ఉష్ణమండల తరంగాలు ఏర్పడినప్పుడు మరో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.. తుఫానులకు తరువాత హంబర్టో, ఐరిస్, కరెన్ లూయిస్ అని పేరు పెట్టారు. భూమి చంద్రుని భ్రమణంలో ఇలాంటి ప్రభావం కనిపిస్తుందని గుర్తించారు. 1955లో, రెండు తుఫానులు ఒకదానికొకటి సమీపంలో ఏర్పడ్డాయి. హరికేన్స్ కోనీ, డయాన్ సమయంలో ఒక భారీ హరికేన్ ఏర్పడింది..