German Woman: రెండు దేశాలను కలిపిన ప్రేమ కథ

ప్రేమకు భాషలు, సరిహద్దులు అడ్డుకాదని మరోసారి రుజువైంది. మనసులు కలవాలనే కానీ, మతాలదేముంది. అందరూ మనుషులమే అయినప్పుడు అనుబంధానికి ఆచారాలు... అడ్డుకాదని నిరూపించింది ఈ జంట.

German Woman: రెండు దేశాలను కలిపిన ప్రేమ కథ

German Woman

German Woman: ప్రేమకు భాషలు, సరిహద్దులు అడ్డుకాదని మరోసారి రుజువైంది. మనసులు కలవాలనే కానీ, మతాలదేముంది. అందరూ మనుషులమే అయినప్పుడు అనుబంధానికి ఆచారాలు… అడ్డుకాదని నిరూపించింది ఈ జంట. జర్మనీకి చెందిన మహిళ బీహార్ వాసిని పూర్తిగా భారత సంప్రదాయ పద్ధతుల్లో పెళ్లాడింది.

జర్మనీలో పుట్టిన లారిసా బెల్చ్ అనే మహిళ బీహార్‌లోని నవదాకు చెందిన సత్యేంద్ర కుమార్ ను పెళ్లాడింది. ఇద్దరూ స్వీడన్ లో రీసెర్చ్ స్టూడెంట్స్ గా పరిచయం కావడం, అది కాస్తా ప్రేమగా మారడంతో పెద్దల సమక్షంలో ఒకటయ్యారు. సత్యేంద్ర స్కిన్ క్యాన్సర్ పై రీసెర్చ్ చేస్తుంటే, లారిసా ప్రొస్టేట్ క్యాన్సర్ పై రీసెర్చ్ చేస్తున్నారు.

2019లో కలిసిన వీరిద్దరూ మూడేళ్ల పాటు ప్రేమించుకున్నారు. దేశీ సంప్రదాయ దుస్తుల్లో బ్లూ, రెడ్ లెహంగాలతో పాటు ఆభరణాలు ధరించి సంబరాల్లో పాల్గొన్నారు. ఇక్కడి సంప్రదాయాల గురించి ఎక్కువ తెలుసుకోవడానికి ఇండియాలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట.

Read Also: సామాన్యుడితో లవ్‌లో రాజకుమారి.. ప్రియుడు కోసం కోట్ల ఆస్తులు, కోట వదిలుకుని!

‘ఇండియాలో నా లైఫ్ ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నా. ఇక్కడున్న వారు చాలా మంచివాళ్లు. మా సంప్రదాయాల్లో చాలా తేడాలు ఉన్నాయి. నాకు హిందీ అర్థమవుతుంది. కాకపోతే సత్యేంద్ర నాకు అర్థమయ్యేలా చెప్తాడు’ అని పెళ్లికూతురు లారిస్సా చెప్తుంది.

సత్యేంద్రను పెళ్లాడేందుకు లారిస్సా స్పెషల్ వీసా మీద ఇక్కడకు వచ్చింది. ఇండియన్ సంప్రదాయాలు, ఆచారాల ప్రకారం పెళ్లి చేసుకోవాలనే కోరికతో వచ్చానని చెప్తున్నారు. వీసా సమస్యల కారణంగా వధువు తరపు పేరెంట్స్, బంధువులు ఎవరూ వేడుకకు హాజరుకాలేకపోయారు.