Covid In Russia And Germany : జర్మనీ,రష్యాపై కోవిడ్ పంజా..రికార్డు స్థాయిలో కేసులు,మరణాలు

జర్మనీ,రష్యాపై కొవిడ్ పంజా విసురుతోంది. రికార్డుస్థాయిలో రోజువారీ కేసులు,మరణాలు నమోదవుతున్నాయి. జర్మనీలో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో

Covid In Russia And Germany : జర్మనీ,రష్యాపై కోవిడ్ పంజా..రికార్డు స్థాయిలో కేసులు,మరణాలు

Germany

Covid In Russia And Germany   జర్మనీ,రష్యాపై కొవిడ్ పంజా విసురుతోంది. రికార్డుస్థాయిలో రోజువారీ కేసులు,మరణాలు నమోదవుతున్నాయి. జర్మనీలో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 33,949 కరోనా కేసులు, 165 మరణాలు నమోదయ్యాయి. జర్మనీలో కొవిడ్​-19 వైరస్​ ప్రబలినప్పటినుంచీ ఈ స్థాయిలో కేసులు నమోదు కావటం ఇదే తొలిసారి.

జర్మనీలో డిసెంబర్-18,2020న నమోదైన 33,777 కేసులే ఇప్పటివరకు అత్యధికం కాగా..గురువారం జర్మనీ ఆ రికార్డును దాటేసిందని అక్కడి అధికారులు తెలిపారు. అయితే గతంతో పోలిస్తే ఐసీయూ వరకూ వచ్చిన కరోనా కేసుల సంఖ్య తక్కువగానే ఉంది. అయితే జర్మనీలో కోవిడ్ కేసులు పెరగాడానికి వ్యాక్సినేషన్ నెమ్మదిగా సాగడమే కారణం.

గురువారం నాటికి జర్మనీలో 66.9శాతం మందికి మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తయింది. జర్మనీలో ఇంకా కోటీ 60 లక్షల మంది టీకా వేసుకోలేదు. దేశంలో ఇంకా వ్యాక్సిన్ తీసుకోనివారు వెంటనే టీకా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకోనివారికి ఇది భారీ మహమ్మారి అవుతుంది అని ఆ దేశ ఆరోగ్య శాఖా మంత్రి జెన్స్ స్పాన్ అన్నారు. జర్మనీలో రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్న క్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి జెన్స్ స్పాన్.. కరోనా వైరస్ విజృంభణ, ఐసీయూ పడకల సామర్థ్యంపై 16 రాష్ట్రాల వైద్యశాఖ మంత్రులతో సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.

మరోవైపు,రష్యాలో కూడా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. సెప్టెంబరు చివరివారం నుంచి రష్యాలో కరోనా కేసులు,మరణాలు అధికంగా నమోదవుతున్నాయి. రష్యాలో గడిచిన 24 గంటల్లో 40,217 కొత్త కోవిడ్ కేసులు నమోదుకాగా,1,195 మరణాలు నమోదయ్యాయి. రష్యాలో ఒక్కరోజు నమోదైన కోవిడ్ మరణాల్లో ఇదే అత్యధికం. రష్యాలో కూడా వ్యాక్సినేషన్ చాలా నెమ్మదిగా సాగుతోంది. ప్రపంచంలో మొదటిగా రష్యానే కొవిడ్ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చినప్పటికీ.. ఇప్పటివరకు 146 మిలియన్ల ఆదేశ జనాభాలో 35శాతం కంటే తక్కువమందికే వ్యాక్సినేషన్ పూర్తయింది.

ALSO READ AP Corona : ఏపీలో కొత్తగా 301 కరోనా కేసులు.. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో..

ALSO READ Europe Covid Deaths : యూరప్ లో మరో 5లక్షల కోవిడ్ మరణాలు..WHO హెచ్చరిక